AP: వైసీపీ నేత అంబటి రాంబాబు తిరుమల పర్యటనలో వైఎస్ జగన్ స్టిక్కర్ ఉన్న చొక్కాతో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ స్ట్రాంగ్‌గా స్పందించారు. ఆయన అంబటి రాంబాబు కాదని, ఆంబోతు రాంబాబు అని విమర్శించారు. చొక్కా లేకుండా గంట ఉండటం రాంబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. అంబటి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంటే టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.