»What Is One Nation One Election What Is The Benefit Of Jamili Election
One Nation One Election: అంటే ఎంటి? ఈ ఏడాది అమలు చేస్తారా?
2014లో ప్రధాన మంత్రి నరేంద్రమోడి తొలిసారిగా ప్రతిపాదించిన ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానంపై ఈ నెలలో అత్యవసర పార్లమెంట్ సమావేశం జరగనుంది. ఇప్పుడు దేశం అంతా హాట్ టాపిక్‌గా ఉన్న ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
What is One Nation, One Election? What is the benefit of Jamili election?
One Nation One Election: కేంద్రంలో బీజేపీ(BJP) ప్రభుత్వం 2014 నుంచి చెబుతున్న జమిలి(Jamili Elections) ఎన్నికల విధానం మళ్లీ తెరమీదకు వచ్చింది. దానికి కారణం సెప్టెంబరు 18 నుంచి 22 వరకు అత్యవసర పార్లమెంటరీ(Parliament ) సమావేశం జరుగుతుండటమే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక దేశం, ఒకే ఎన్నిక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలో పార్లమెంట్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు.
ఒక దేశం ఒకే ఎన్నికలు అంటే ఏమిటి?
వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంటే దేశంలో ఒకే సారి లోక్‌సభ(Lok Sabha), అసెంబ్లీల(Assembly)కు ఎన్నికలను నిర్వహిస్తారు. అంటే దేశమంతా ఒకే రోజు ఒకే సమయంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఎమ్మెల్యే స్థానాలకు, కేంద్రంలో ఎంపీ స్థానాలకు వేర్వేరు సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలా కాకుండా ఒకే సారి జరపడమే వన్ నేషన్, వన్ ఎలక్షన్ దీన్నే జమిలి ఎన్నికలు అని కూడా పిలుస్తున్నారు.
ప్రయోజనాలు
ఒకేసారి ఎన్నికలు జరపడానికి ప్రధాన కారణం ఎన్నికల ఖర్చును తగ్గించుకోవడం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు, ఎన్నికలను నిర్వహించిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఖర్చు చేసిన మొత్తం రూ.60,000 కోట్లు అని ఓ నివేదిక తెలిపింది. ఇది అధికారికంగా ఖర్చు చేసిన మొత్తం. అదే ఒకే సమయంలో ఎన్నికలు జరిగితే ఇంత ఖర్చు ఉండదని, అలాగే పరిపాలన సామర్థం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సాధారణ ఎన్నికలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు, అభివృద్ధికి అడ్డం పడుతున్నాయి. ఎన్నికలు జరిగినప్పుడల్లా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విధించడం ద్వారా కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేయడానికి వీలు లేదని, అంతేకాకుండా, ఒకేసారి ఓట్లు వేయడానికి ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని లా కమిషన్ కూడా స్పష్టం చేసింది.
నష్టాలు
అయితే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం రాజ్యంగ సవరణలు అవసరం. ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు ఇతర పార్లమెంటరీ విధానాలను కూడా సవరించాల్సి ఉంటుంది. ఏకకాల ఎన్నికలపై ప్రాంతీయ పార్టీలకు ఉన్న ప్రధాన భయం ఏంటంటే, జాతీయ అంశాలు ప్రధానాంశంగా ఉండటంతో వారు తమ స్థానిక సమస్యలను బలంగా లేవనెత్తలేరు. ఎన్నికల వ్యయం, ఎన్నికల వ్యూహం విషయంలో కూడా జాతీయ పార్టీలతో పోటీ పడలేకపోవచ్చు. 2015లో ఐడీఎఫ్సీ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఓ అధ్యయనంలో రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటర్లు గెలిచే రాజకీయ పార్టీ లేదా కూటమిని ఎంచుకునే అవకాశం 77 శాతం ఉందన్నారు. ఆరు నెలల వ్యవధిలో జరిగితే 61 శాతం మంది ఓటర్లు మాత్రమే అదే పార్టీని ఎన్నుకుంటారని పేర్కొంది.