రాజకీయ లబ్ది కోసం ప్రధాని మోదీ తల్లిని లాగడం కరెక్ట్ కాదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను స్మృతీ ఇరానీ తప్పుపట్టారు. ప్రచారం కోసం ఆప్ నేతలు చేసే వ్యాఖ్యల వల్ల గుజరాత్ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఆప్ నేత ప్రధాని మోడీ 100 ఏళ్ళ తల్లిని అవమానించారని ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయలబ్ధి కోసం ప్రధాని తల్లిని అవమానించారని ఆరోపించారు. ప్రధాని మోడీ తల్లి చేసిన తప్పు ఏంటని ప్రశ్నించారు. ఆప్ రాజకీయాలను నరేంద్ర మోడీ అడ్డుకుంటున్నారని మోడీ తల్లిని అవమానించారని స్మృతి ఇరానీ ఆరోపించారు.
గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. గుజరాత్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని తల్లిని అవమానిస్తే రాజకీయంగా లబ్ది చేసురుతుందను కోవడం తప్పని అన్నారు. కేజ్రీవాల్‌కు తెలీకుండా ఆప్ నేతలు మాట్లాడరని .. అన్నీ కేజ్రీవాల్ సూచనల మేరకే జరుగుతున్నాయని స్మృతి ఇరానీ ఆరోపించారు.
గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ గోపాల్ ఇటాలియా గతంలో ఓసారి ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని అపహాస్యం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఆ వ్యాఖ్యలతో కూడిన వీడియోను బీజేపీ నేతలు తాజాగా విడుదల చేశారు. అక్కడితో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలయింది.