»Video Viral The Waves That Caught His Wife While He Was Watching A Trip That Turned Tragic
Video Viral: చూస్తుండగానే భార్యను లాక్కెళ్లిన అలలు..విషాదంగా మారిన విహారయాత్ర
పిల్లలు చూస్తుండగానే వారి తల్లి అలల్లో కొట్టుకుపోయింది. ఈ దారుణ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ కుటుంబం సరదాగా గడుపుదామని విహారయాత్రకు వెళ్లింది. సముద్రపు ఒడ్డున ఆనందంగా గడుపుతుండగా రాకాసి అలలు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ మరణించింది. తన పిల్లల కళ్ల ముందే ఆ తల్లి అలల్లో కొట్టుకుపోయి విగతజీవిగా కనిపించింది. ఈ దారుణ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
వైరల్ అవుతోన్న వీడియో:
This is so horrible How can a person risk their life for some videos.. The lady has swept away and lost her life in front of his kid.#bandstand#Mumbaipic.twitter.com/xMat7BGo34
ముకేశ్, జ్యోతి సోనార్(32) అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి బీచ్ కు వెళ్లాలనుకున్నారు. అయితే అలల ఉధృతి కారణంగా జుహు చౌపట్టి బీచ్ లోకి అనుమతించలేదు. దీంతో వారు తమకు ఇంకొంచెం దూరంలో ఉన్నటువంటి బాంద్రా ఫోర్ట్‌కు వెళ్లారు. అక్కడ చాలా సేపు తమ పిల్లలతో గడిపారు. సరదాగా ఫోటోలు తీసుకున్నారు.
అలలు వస్తుండగా ఫోటోలు దిగేందుకు ఒడ్డున ఉన్న రాళ్లపైకి చేరుకున్నారు. అలలు వస్తూ ఉంటే ఫోటోలు తీయించుకున్నారు. అంతలోనే రాకాసి అలలు జ్యోతిని లాక్కెళ్లాయి. భర్త తన భార్య చీరను గట్టిగా పట్టుకున్నా లాభం లేకుండా పోయింది. జ్యోతి సముద్రంలో కోట్టుకుపోయింది. పిల్లలు చూస్తుండగానే ఆ తల్లి సముద్రంలోకి వెళ్లిపోయింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని వెలికితీసి కుటుంబీకులకు అప్పగించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.