»Up Budget 2024 Rs 2600 Crore For Prayagraj Mahakumbh 2025 And Rs 100 Crore For Ayodhya Development
UP Budget 2024: 2025మహాకుంభానికి రూ.2600 కోట్ల బడ్జెట్.. యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది జరిగే మహా కుంభానికి బడ్జెట్లో రూ.2600 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
UP Budget 2024: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది జరిగే మహా కుంభానికి బడ్జెట్లో రూ.2600 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయోధ్య అభివృద్ధికి గణనీయమైన బడ్జెట్ కేటాయింపు కూడా చేయబడింది. ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా సోమవారం అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత బడ్జెట్ అంచనాలను సమర్పిస్తూ.. బడ్జెట్లో పట్టణాభివృద్ధి శాఖకు రూ.2500 కోట్లు, సాంస్కృతిక శాఖకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మహాకుంభ్ 2025 నిర్వహణ కోసం రూ.2600 కేటాయించాలని ప్రతిపాదించారు.
రాష్ట్రంలో ధార్మిక మార్గాల అభివృద్ధికి రూ.1750 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగింది. అయోధ్య సర్వతోముఖాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించామన్నారు. దీంతో పాటు అయోధ్యలోనే అంతర్జాతీయ రామాయణం, వేద పరిశోధన సంస్థకు రూ.10 కోట్ల కేటాయింపులు బడ్జెట్లో ప్రతిపాదించారు. అయోధ్యలో ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్’ స్థాపన, విస్తరణ కోసం 150 కోట్ల రూపాయల కేటాయింపు ప్రతిపాదించబడింది. శ్రంగ్వేర్పూర్లో నిషాద్ రాజ్ గుహా కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు రూ.14.68 కోట్లు, హరిహర్‌పూర్, అజంగఢ్‌లో సంగీత కళాశాల ఏర్పాటుకు రూ.11.79 కోట్లు, మహర్షి వాల్మీకి కల్చరల్ ఏర్పాటుకు రూ.10.53 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు ఖన్నా తెలిపారు.
సాంస్కృతిక వారసత్వ ప్రాంతాలైన అయోధ్య, వారణాసి, చిత్రకూట్, లక్నో, వింధ్యాచల్, ప్రయాగ్‌రాజ్, నైమిశారణ్య, గోరఖ్‌పూర్, మధుర, బటేశ్వర్ ధామ్, గర్హ్ముక్తేశ్వర్, శుక్తీర్థ ధామ్, మా శాకుంభరీ దేవి, సారనాథ్, ఇతర ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కోసం పని జరుగుతోందని ఆర్థిక మంత్రి చెప్పారు. “ముఖ్యమంత్రి టూరిజం డెవలప్మెంట్ పార్టనర్షిప్ స్కీమ్” కింద, ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ఉందని ఆయన చెప్పారు. 2023 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉత్తరప్రదేశ్‌కు 37 కోట్ల 90 లక్షల మంది పర్యాటకులు వచ్చారని, అందులో భారతీయ పర్యాటకుల సంఖ్య 37 కోట్ల 77 లక్షలు కాగా, విదేశీ పర్యాటకుల సంఖ్య 13 లక్షల 43 వేలు అని ఖన్నా చెప్పారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరం కూడా అయోధ్యలో దీపోత్సవ్ను పెద్ద ఎత్తున నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా రామ్ కీ పౌరీపై 22 లక్షల 23 వేల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. భారతదేశ సంస్కృతి మతపరంగా, మేధోపరంగా, శాస్త్రీయంగా చాలా గొప్పదని ఖన్నా అన్నారు. గత ప్రభుత్వాలు మన సాంస్కృతిక వారసత్వాన్ని విస్మరించాయని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో మన సాంస్కృతిక ప్రగతి పురోగాభివృద్ధి సాధించిందన్నారు. గ్రీస్, ఈజిప్ట్, రోమా అన్నీ ఎ అదృశ్యమయ్యాయి, కానీ ఇప్పటివరకు మన చారిత్రక ఆధారాలు మిగిలే ఉన్నాయన్నారు.