మధ్యప్రదేశ్ లో రక్షణ శాఖకు చెందిన రెండు యుద్ద విమానాలు కుప్పకూలడం కలకలం రేపింది. మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కుప్పలకూలాయి. ఈ రెండు ఘటనలకు సంబంధించి సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గ్వాలియర్ ఎయిర్‌బేస్ నుంచి యుద్ధ విమానాల విన్యాసాలు జరుగుతుండగా.. మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ విమానాలు ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలాయి. శిక్షణ సమయంలో ఇవి ఢీకొన్నట్లు పేర్కొంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి రెండు విమానాలు వ్యాయామాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. కాగా సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణమా? అనే విషయం తెలియాల్సి ఉంది.