యూపీ (UP) లో కలకలం కాల్పులు కలకలం రేపింది. షాజహాన్‌పూర్(Shahjahanpur)లో దారుణం జరిగింది. బైక్ పై వచ్చిన సాయుధ దుండుగులు కూతురిని భుజాలపై మోస్తున్న వ్యక్తి తలపై తుపాకీతో కాల్చి పరారయ్యారు. గమినంచిన స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతడ్ని తదుపరి చికిత్స కోసం బరేలీకి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాధితుడిని 28 ఏళ్ల షోయబ్(Shoaib)గా గుర్తించారు. తుపాకీతో కాల్చిన ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. షోయబ్ తన కూతురిని భుజంపై వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది.
మోటారు సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు అతనిని దాటడం, ఆ వ్యక్తిని చూడడానికి వెనుకకు తిరిగే ముందు ఆపివేయడం కనిపిస్తుంది. అప్పుడు ఒక సాయుధ దుండగుడు షోయబ్‌ను సమీపించి షోయబ్ తలపై కాల్చడం (burning) వీడియోలో కనిపించింది. ఆ తరువాత, దుండగుడు బైక్‌పై వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి అక్కడ్నుంచి పారిపోయారు. తుపాకీతో కాల్చడంతో నేలపై పడిపోయాడు షోయబ్, అతని కుమార్తె కూడా కిందపడిపోయింది. ఘటనను గమనించిన స్థానికులు వారికి సాయం చేసేందుకు పరుగు తీసుకుంటూ వెళ్లారు.ఆగస్టు 13న ఈ ఘటన జరిగిందని షాజహాన్‌పూర్ ఎస్పీ అశోక్ మీనా (SP Ashok Meena)వెల్లడించారు. ఘటనకు సంబంధించిన ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితుల గుర్తింపును పరిశీలిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. గతవారం బీజేపీ నేతను దుండుగులు కాల్చిచంపిన నాలుగు రోజుల్లోనే ఇది జరగడం గమనార్హం. తాజా, ఘటనలో గాయపడిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.