»These 8 Companies Do Not Pay Tax New Rules Across The Country
Income Tax: ఈ 8 సంస్థలు పన్ను చెల్లించవద్దు!
భారతీయ ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో వ్యక్తులకు, సంస్థలకు పన్నుల మినహాయింపు ఇచ్చింది. వీటి గురించి తెలుసుకుంటే పన్ను చెల్లింపుదారులు తమ భారాన్ని తగ్గించుకోవచ్చు.
These 8 companies do not pay tax! New rules across the country
Income Tax: భారతదేశం(India)లో ఆదాయపు పన్ను(Income Tax) ఎలా విధిస్తారో మనకు తెలిసిందే. ఇతర దేశాల మాదిరిగానే మన దేశంలో కూడా వ్యక్తి లేదా సంస్థ ఆదాయాన్ని బట్టి పన్ను నియమాలు(Income Rules) ఉంటాయి. ప్రతీ సంవత్సరం ఈ నియమాలలో సవరణలు జరుగుతాయి. మనకు వస్తున్న జీతం నుంచి, లేదా కంపెనీల ఆదాయం నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని అందరికి తెలుసు. కానీ, కొన్ని సందర్భాలలో ప్రభుత్వానికి మనం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అది మనకు వచ్చే అదాయమే అయినా ప్రభుత్వం మనపై ట్యాక్స్ భారాన్ని మోపదు. మరీ ఆ సందర్భాలు ఏంటో తెలుసుకోవడం మన బాధ్యత.
1961 ఆదాయపు పన్ను చట్టంలోని రూల్ 10(1) ప్రకారం వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయాని(Agricultural Income Tax)కి పూర్తి పన్ను మినహాయింపు(Tax exemption) లభిస్తుంది. ఈ నిబంధన వ్యవసాయ రంగ అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇప్పటికీ ప్రభుత్వాలు అమలు పరుస్తున్నాయి. అంతే కాకుండా ఈ రూల్ రైతులకు కూడా ఎంతో సహాయం చేస్తుంది. వివాహం సందర్భాలలో ప్రభుత్వం ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాల కింద కొంత మొత్తాన్ని చెల్లిస్తోంది. వీటిని అబ్ధిదారులు జమ చేసుకునే సందర్భాల్లో ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. రూల్ 10(10D) ప్రకారం ఇన్సూరెన్స్ పాలసీ(Insurance policy) ద్వారా స్వీకరించిన మొత్తం కూడా పన్ను పరిధిలోకి రాదు.
సెక్షన్ 10(10C) కింద స్వచ్ఛంద పదవీ విరమణను ఎంచుకునే వ్యక్తులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(VRS) పరిహారంపై పన్నుల చెల్లింపు నుంచి ఉపశమనం లభిస్తోంది. వారసత్వ ఆస్తులకు(Inheritance assets) ఎలాంటి పన్ను విధించబడవు. కానీ వాటి నుంచి వచ్చే ఆదాయానికి టాక్సీ చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 80C, 10Dలో పేర్కొన్న విధంగా ప్రావిడెంట్ ఫండ్ల(Provident Funds)లో, ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్టిన పెట్టుబడులకు కూడా పన్నుల నుంచి మినహాయించబడ్డాయి. సెక్షన్ 10(17A) కింద స్కాలర్షిప్ల నుంచి పొందిన నిధులు, రెవెన్యూ నిబంధనల ప్రకారం పరిహారం పన్నుకు లోబడి ఉండవు. ఒక వ్యక్తి సంస్థలో లాభ-భాగస్వామ్యాన్ని కలిగి ఉంటే, సంస్థ యొక్క లాభంలో వారి వాటాపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా, వారు మొత్తం కంపెనీ లాభంపై మాత్రమే పన్నులు చెల్లించవలసి ఉంటుంది.