హైదరాబాద్ పరిధిలో ఓ కారు నానా బీభత్సం సృష్టించింది. ఉదయం మార్నింగ్ వాకింగ్ కోసం వెళుతున్న నలుగురిని బండ్లగూడ జారీర్ సన్ సిటీ వద్ద ఢీ కొట్టింది. దీంతో ఈ ఘటనలో తల్లి, కుమార్తె మరణించారు. మరో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు అనురాధ(38), మమత(26)గా గుర్తించారు. అయితే అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.