»The Gates Of Sabarimala Temple Are Closed Today The Reason Is The Same
Sabarimala: నేడు శబరిమల ఆలయ ద్వారాలు మూసివేత..కారణం అదే
శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆలయంలో మండల పూజ నిర్వహించనున్నారు. ఆ పూజ తర్వాత రాత్రి 11 గంటలకు ఆలయ తలుపులను అధికారులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. చివరి రోజు కావడంతో శబరిమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
నేడు శబరిమల ఆలయ (sabarimala Temple) ద్వారాలను మూసివేయనున్నారు. ఈ రోజు శబరిమల ఆలయంలో మండలపూజను నిర్వహించనున్న నేపథ్యంలో రాత్రి 11 గంటలకు సన్నిధానం తలుపులను ట్రావెన్ కోర్ అధికారులు మూసివేయనున్నట్లు తెలిపారు. చివరి రోజు కావడంతో శబరిమలకు భారీగా అయ్యప్ప భక్తులు తరలివస్తున్నారు.
భక్తులు భారీగా తరలివస్తుండటంతో శబరిమల అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం అవుతోంది. అయ్యప్ప స్వామిని ఇప్పటి వరకూ 34 లక్షల మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గత 40 రోజుల్లో శబరిమలకు రూ.208 కోట్ల ఆదాయం సమకూరిందని ట్రావెన్ కోర్ సంస్థ అధికారులు వెల్లడించారు.
అలాగే కానుకల రూపంలో శబరిమల ఆలయానికి మరో రూ.67 కోట్లు వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. భక్తులు సమర్పించిన నాణేల ద్వారా రూ.63.89 కోట్లు వచ్చిందని, ప్రసాదం విక్రయం ద్వారా రూ.96.32 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. అలాగే శబరిమలలో 7,25,049 మందికి అన్నదానం నిర్వహించినట్లు ట్రావెన్కోర్ బోర్డు ప్రకటించింది.