»Horoscope Today Todays Horoscope 2024 January 6th
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 January 6th)..ఈ రాశుల వారికి చికాకులు తప్పవు!
ఈ రోజు(2024 January 6th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం:
ఈ రాశుల వారికి చేపట్టిన అన్ని పనుల్లో విజయం దక్కుతుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్న కల నెరవేరుతుంది. కుటుంబీకులు, సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం బావుంటుంది.
వృషభం:
ఈ రాశుల వారు పనులన్నీ వాయిదా వేస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పెడుతుంది. అధికంగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. కుటుంబంలో వివాదాలు నెలకొంటాయి. అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడి ఉంటుంది.
మిథునం:
ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి అంతగా బావుండదు. అన్ని విషయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు. వ్యాపారాలు నిరాశను కలిగిస్తాయి. దైవ దర్శనాలు చేస్తారు. కుటుంబంలో చికాకులు ఉంటాయి.
కర్కాటకం:
ఈ రాశివారికి కొత్తవారు పరిచయం అవుతారు. బంధువులు, కుటుంబీకుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు బావుంటాయి. వ్యాపారంలో లాభాలను చూస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
సింహం:
ఈ రాశివారికి ఆర్థిక మెరుగ్గా ఉంటుంది. గుడ్ న్యూస్ వింటారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. ఆరోగ్యం పర్వాలేదు.
కన్య:
ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కుటుంబంలో ఒత్తిడి నెలకొంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. భూవివాదాలు ఉంటాయి. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. చికాకులు కలుగుతాయి.
తుల:
ఈ రాశుల వారికి అన్ని వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఏర్పడతాయి. అనారోగ్యం వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడి ఉంటుంది. దైవ దర్శనాలు చేస్తారు. అనవసర వాగ్దానాలు చేయకండి.
వృశ్చికం:
ఈ రాశివారికి బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదాలు దక్కుతాయి. భూములు కొనే అవకాశం ఉంటుంది. ఆదాయం బావుంటుంది.
ధనుస్సు:
ఈ రాశివారు పనులను వాయిదా వేస్తూ ఉంటారు. రుణాలు పొందుతారు. బంధువర్గంతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
మకరం:
ఈ రాశివారికి సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు చికాకులు తొలగి సంఘంలో గౌరవం దక్కుతుంది. దైవ దర్శనాలు చేస్తారు.
కుంభం:
ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. రుణయత్నాలు చేస్తారు. పనుల్లో అవరోధాలు ఏర్పడుతాయి. బాధ్యతలు పెరగడంతో కొంత ఒత్తిడికి గురవుతారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకాలు అందుతాయి. ఆదాయం పర్వాలేదు. ఆరోగ్యం బావుంటుంది.
మీనం:
ఈ రాశివారు నేడు రహస్య విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. అప్పుల వారి నుంచి ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆదాయం తగ్గుతుంది.