»Horoscope Today Todays Horoscope December 27th 2023 Sudden Money Gain
Horoscope Today : నేటి రాశిఫలాలు(December 27th 2023)..ఆకస్మిక ధనలాభం!
ఈ రోజు(December 27th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
మేషం:
ఈ రాశివారికి అన్నింట్లోనూ మంచే జరుగుతుంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటుంబంలో చికాకులు దూరం అవుతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆలయాలను దర్శిస్తారు.
వృషభం:
ఈ రాశివారు వ్యయ ప్రయాసలు పడుతారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. మిత్రులతో గొడవలు జరగకుండా చూసుకుంటే మంచిది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆదాయం బావుంటుంది.
మిథునం:
ఈ రాశివారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందం దూరం అవుతుంది. బంగారు నగలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబంతో కలిసి పలు ఆలయాలను సందర్శిస్తారు.
కర్కాటకం:
ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది. శుభవార్తలు వింటారు. ఆత్మీయుల నుంచి సహకారం లభిస్తుంది. అనుకోకుండా డబ్బులు చేతికి అందుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులకు ధన సాయం చేస్తారు. ఆరోగ్యం బావుంటుంది.
సింహం:
ఈ రాశివారికి పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. బంధువులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ప్రయాణాలను వాయిదా వేస్తారు.
కన్య:
ఈ రాశివారికి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పాత స్నేహితులను కలుస్తారు. ఆదాయం బావుంటుంది. ఆరోగ్యం పర్వాలేదు.
తుల:
ఈ రాశివారికి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కొన్ని విషయాల్లో మనస్తాపం చెందుతారు. కుటుంబంలో భయాందోళనలు ఉంటాయి. ఎవ్వరికీ మాట ఇవ్వకుండా ఉంటే మంచిది. దైవ దర్శనాలు చేస్తారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
వృశ్చికం:
ఈ రాశివారికి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
ధనుస్సు:
ఈ రాశివారు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రుణ లాభం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉండదు. స్నేహితులకు ధన సాయం చేయకుంటే మంచిది.
మకరం:
ఈ రాశివారికి కుటుంబ కలహాలు దూరం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో అలసట చెందుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి.
కుంభం:
ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు తీరుతాయి. కొత్త వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులను కలుస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆదాయం బావుంటుంది.
మీనం:
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం లభిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. స్నేహితులను కలుస్తారు. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వింటారు.