»The Death Of A Cheetah Brought From South Africa Is The Second In A Month
Kuno National Park : దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతా మృతి …నెల రోజుల వ్యవధిలో రెండోది
సౌత్ ఆప్రికా నుంచి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కుకు (Kuno National Park) తీసుకొచ్చిన మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. చీతా చనిపోవడం నెల రోజుల్లో ఇది రెండోసారి
దక్షిణఫ్రికా (South Africa) నుంచి మధ్యప్రదేశ్లోని కునో నేషల్ పార్క(Kuno National Park)కు తీసుకొచ్చిన మరో చీతా కన్నుమూసింది. చీతా చనిపోవడం నెల రోజుల్లో ఇది రెండో సారి చికిత్స పొందుతూ మగ చీతా ఉదయ్ (Cheetah Uday)నిన్న మరణించినట్టు ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా (Project Cheetah)లో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటిలో సాశా (Sasha) అనే ఆడ చీతా (Cheetah) అనారోగ్యంతో ఈ ఏడాది మార్చిలో మృతి చెందింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకురాగా, తాజాగా వాటిలో ఉదయ్ అనే మగ చీతా మృత్యువాత పడింది. అయితే, తొలివిడతలో నమీబియా (Namibia) నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒక చీతా మార్చి 29న నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఇటీవలే ఈ చీతాలకు ప్రధాని మోదీ (PM MODI) అభ్యర్థన మేరకు ప్రజలు సూచించిన దేశీయ పేర్లను పెట్టారు. వీటిలో కవల చీతాలైన ఎల్టన్, ప్రెడ్డీలకు గౌరవ్, శౌర్య అని పేర్లు మార్చగా, నాలుగు కూనలకు జన్మనిచ్చిన సియాయా చీతాకు జ్వాలా అని పేరు మార్చారు.