Sudha Murthy, Shankar Mahadevan in new NCERT panel for content in school textbooks
Sudha Murthy, Shankar Mahadevan: మూడో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పాఠ్యాంశాల రూపకల్పన కమిటీలో సుధా మూర్తి, శంకర్ మహాదేవన్కు చోటు లభించింది. సుధామూర్తి (Sudha Murthy).. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణీ, రచయిత కూడా. శంకర్ మహాదేవన్ (Shankar Mahadevan) ప్రముఖ నేపథ్య గాయకుడు. ప్రధానమంత్రి ఆర్థికశాఖ సలహాదారుడు సంజీవ్ సన్యాల్ కూడా కమిటీలో ఉన్నారు.
19 మంది సభ్యులతో కలిపి ‘నేషనల్ సిలబస్ అండ్ టెస్టింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీని ఏర్పాటు చేశామని ఎన్సీఈఆర్టీ ప్రకటించింది. కమిటీకి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చాన్స్ లర్ ఎంసీ పంత్ నేతృత్వం వహిస్తారు.
జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా కే కస్తూరి రంగన్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ డెవలప్ చేసిన పాఠశాల విద్య కోసం నేషనల్ కరిక్యూలమ్ ఫ్రేమ్ వర్క్ పాఠ్యాంశాలను సమన్వయం చేస్తోంది. ఎన్సీఎఫ్-ఎస్ఈ విద్యా మంత్రిత్వ శాఖకు సమర్పించబడింది. కానీ పబ్లిక్ డొమైన్లో విడుదల కాలేదు. ఫ్రేమ్ వర్క్ ముసాయిదా మాత్రం ఏప్రిల్లో విడుదలైంది.
ప్రిన్స్టన్ వర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్ మంజుల్ భార్గవ్ కమిటీతో కో-చైర్మన్గా ఉంటారు. ప్రొఫెసర్ సుజాతా రామ్దొరై, బ్మాడ్మింటన్ ప్లేయర్ యు విమల్ కుమార్, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ చైర్ పర్సన్ ఎండీ శ్రీనివాస్, భారతీయ భాషా సమితి ఛైర్ పర్సన్ చాము కృష్ణశాస్త్రి ఇతర సభ్యులుగా ఉన్నారు.