Strict rules for those who are in a live-in relationship in the context of Uttarakhand's Uniform Civil Code
Uniform Civil Code: లివిన్ రిలేషన్షిప్( live-in relationship)లో ఉన్నవారికి ఎలాంటి కట్టుబాట్లు, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిబంధనలు లేవన్న విషయం తెలిసిందే. ఇకపై అలా కాకుండా స్త్రీ, పురుషులు అటువంటి సంబంధంలో కొనసాగాలి అనుకుంటే ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నేడు శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు అమోదం పొందితే లివిన్ రిలేషన్షిప్లో జిల్లా అధికారుల వద్ద ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే జైలుకు వెళ్లే నిబంధనలు అమలు చేయనుంది.
జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాల మధ్య ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇక ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే లివిన్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలనుకుంటున్న వారు, ఇప్పటికే ఆ సంబంధంలో ఉన్నవారు తప్పకుండా జిల్లా అధికారుల వద్ద తమ బంధాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. వారి వయసు 21 నిండక పోయినా, తల్లిదండ్రుల అనుమతి లేకపోయినా.. రిజిస్టర్ చేయరు. అంతే కాదు ప్రజా నైతికతకు వ్యతిరేకంగా ఉన్నా అంటే జంటలో ఒకరికి ఇప్పటికే వివాహమైనా, భాగస్వామి మైనర్ అయినా ఆ బంధాన్ని రిజిస్టర్ చేయరు. ఇదంతా ప్రజా శ్రేయస్సుకోసమే అని ప్రభుత్వం భావిస్తుంది.