Salaman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కేసులో పట్టుబడిన నిందితుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా అతనితో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు. కాగా, ఈ కేసులో అరెస్టయిన నాలుగో నిందితుడిని వైద్యపరమైన కారణాలతో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. సల్మాన్‌ఖాన్ కాల్పుల కేసులో అరెస్టయిన నిందితుల్లో ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ముంబై పోలీసులు బుధవారం సమాచారం అందించారు. అతడిని జీటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు అనుజ్ థాపన్గా గుర్తించారు. ముష్కరులకు ఆయుధాలు అందించారని ఆరోపించారు.
ఏప్రిల్ 25న పంజాబ్‌కు చెందిన మరో నిందితుడు సోను సుభాష్ చందర్ (37)తో పాటు థాపన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు 24 ఏళ్ల విక్కీ గుప్తా, 21 ఏళ్ల సాగర్ పాల్లను కూడా అరెస్టు చేశారు. థాపన్, విక్కీ , సాగర్ పాల్ ముంబై పోలీసుల కస్టడీలో ఉండగా సోను కుమార్ చందర్ బిష్ణోయ్‌ను వైద్య కారణాలతో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులకు సంబంధించి మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) అభియోగాలను ఎదుర్కొంటున్న నలుగురు నిందితులలో ఒకరు ఈ కేసులో ప్రభుత్వ సాక్షిగా మారడానికి తన కోరికను వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే నిందితుడి పేరును పోలీసులు వెల్లడించలేదు.
ఆదివారం, ఏప్రిల్ 14, ఉదయం 5 గంటల ప్రాంతంలో గెలాక్సీ అపార్ట్మెంట్లో 4-5 బుల్లెట్లు ఒకదాని తర్వాత ఒకటి కాల్చబడ్డాయి. ఈ వార్త బయటకు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. సల్మాన్ భద్రతపై అందరూ ఆందోళన చెందారు. అయితే ఖాన్ కుటుంబానికి ఏమీ జరగదని పోలీసులు, ప్రభుత్వం హామీ ఇచ్చాయి. సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ నుండి రెండు మూడు రోజులు కూడా బయటకు రాలేదు. గతంలో కంటే సల్మాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై బుల్లెట్లు పేలినప్పటి నుండి, ఈ విషయంలో చాలా అప్డేట్లు బయటకు వచ్చాయి. సల్మాన్ ఖాన్ దుబాయ్ వెళ్లగానే లారెన్స్ బిస్నోయ్ పేరుతో సల్మాన్ ఇంటికి క్యాబ్ బుక్ చేసి పంపించారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.