Badrinath : బద్రీనాథ్ థామ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయం తెరిచిన నెల రోజుల్లోగానే ఐదు లోల మంది స్వామిని దర్శించుకున్నారు. ఇది గతంతో పోలిస్తే రికార్డేనని ఆలయ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఈ సమయానికి ఆలయాన్ని మొత్తం 4.5 లక్షల మంది దర్శించుకున్నారు. అదే ఈ ఏడాది మరో 50 వేల మంది అదనంగా స్వామి వారి దర్శనానికి వచ్చారు.
ఈ విషయమై బద్రినాథ్(Badrinath), కేథార్నాథ్ ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కిషోర్ పన్వార్ మాట్లాడారు. మొత్తం ఛార్ధామ్ యాత్రకు ఇప్పటి వరకు 19 లక్షల మంది భక్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఆలయం తెరిచిన నెలలోపే బద్రీనాథ్ థామ్ను ఏకంగా ఐదు లక్షల మంది సందర్శించారని అన్నారు. భవిష్యత్తులో మరింత ఎక్కువగా భక్తుల తాకిడి ఉంటుందని తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్(Badrinath) ఆలయం తలుపుల్ని మేనెల 12న తెరిచారు. అంటే నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తి కావొస్తోంది. ఈ లోపుగానే ఐదు లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారు. ఛార్ ధామ్ యాత్రలో భాగంగా కేథార్ నాథ్, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ల్లో అక్షయ తృతీయ రోజు పూజలు చేసి ఆలయాన్ని భక్తుల(Pilgrims) కోసం తెరుస్తారు. ఇక అప్పటి నుంచి నిత్యం పదుల వేల సంఖ్యలో భక్తులు వీటిని దర్శించుకుంటున్నారు.