»Rahul Gandhi Convicted Sentenced To 2 Years In Jail In Modi Surname Defamation
Rahul Gandhi convicted: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష, ఎందుకంటే?
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సూరత్ కోర్టు (Surat Court) భారీ షాక్ ఇచ్చింది. ఓ పరువు నష్టం (Defamation case against Rahul Gandhi) దావా కేసులో అతనిని దోషిగా (Rahul Gandhi Convicted) తేల్చిన న్యాయస్థానం, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సూరత్ కోర్టు (Surat Court) భారీ షాక్ ఇచ్చింది. ఓ పరువు నష్టం (Defamation case against Rahul Gandhi) దావా కేసులో అతనిని దోషిగా (Rahul Gandhi Convicted) తేల్చిన న్యాయస్థానం, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది. మోడీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలే (Modi surname) అని 2019లో ఆయన కర్నాటకలో ఓ సభలో వ్యాఖ్యానించారు. దీని పైన గుజరాత్ కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పుర్నేష్ మోడీ కోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడి పైన పరువు నష్టం దావా (criminal defamation case filed against Rahul Gandhi) వేసారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 504 కింద రెండేళ్ల జైలు శిక్షను వేసింది. ఈ సెక్షన్ కింద గరిష్ట శిక్ష రెండేళ్లు ఉంటుంది.
2019 లోకసభ ఎన్నికల (2019 Lok Sabha elections) సమయంలో రాహుల్ గాంధీ కర్నాటకలోని కోలార్ లో భారీ బహిరంగ సభలో (Rahul Gandhi Karnataka Kolar public meeting) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ పేరు ఉన్న వారంతా దొంగలు (why all thieves Modi remark) అని మాట్లాడారు. ఈ కేసులో అతనికి శిక్ష పడి, వెంటనే బెయిల్ వచ్చింది. కాగా, రాహుల్ గాంధీకి (Rahul Gandhi) మద్దతుగా కాంగ్రెస్ పార్టీ గురువారం సూరత్ లో పోస్టర్లు వేసింది. కోర్టు విచారణ కోసం కాంగ్రెస్ ఎంపీ వచ్చినప్పుడు సూరత్ కోర్టు వెలుపల పోస్టర్లు కనిపించాయి. ‘ప్రజాస్వామ్యానికి మద్దతుగా సూరత్ కు వెళ్దాం’ అని ఆ పోస్టర్ లలో ఉన్నది. ఈ పోస్టర్ లలో భగత్ సింగ్, సుఖ్ దేవ్ (Bhagat Singh and Sukhdev) చిత్రాలు కూడా ఉండటం గమనార్హం.