»Rahul Gandhi An Obstacle To Rahuls Bharat Jodo Nay Yatra
Rahul Gandhi: రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఆటంకం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్రం అస్సాంలో జరుగుతోంది. అయితే ఈ యాత్రలో ప్రజలు పాల్గొనకుండా అస్సాం ప్రభుత్వం అడ్డుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్రం అస్సాంలో జరుగుతోంది. అయితే ఈ యాత్రలో ప్రజలు పాల్గొనకుండా అస్సాం ప్రభుత్వం అడ్డుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో పాదయాత్రను, స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని నిలిపివేయాలని జిల్లా యంత్రాంగం రాహుల్‌కు సూచిస్తూ.. కార్యక్రమాలకు అనుమతి నిరాకరించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు దుండగులు ప్రయత్నించే అవకాశం ఉందని ఈ చర్యలు తీసుకున్నట్లు అస్సాం ప్రభుత్వం తెలిపింది.
దేశంలో ఒకే రోజు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ, జోడో యాత్ర.. ఈ రెండు ప్రధాన కార్యక్రమాలను అదునుగా తీసుకుని దుండగులు సంఘ వ్యతిరేక కార్యకలాపాలుక పాల్పడతారని సమాచారం. రాహుల్ గాంధీ సెక్యూరిటీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మోరిగావ్ పట్టణంలో శ్రీమంత శంకరదేవ చౌక్ నుంచి పోలీసు పాయింట్ వరకు పాదయాత్రను నిలిపివేయాలని అభ్యర్థించారు. రోడ్‌షోలో భాగంగా వాహనాలను ఎక్కడా ఆపవద్దని జిల్లా ఉన్నతాధికారులు కాంగ్రెస్ పార్టీకి లేఖ రాశారు.