»President Droupadi Murmu Women Reservation Bill Nari Shakti Vandan Adhiniyam
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతికి పంపకముందే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గురువారం బిల్లుపై సంతకం చేశారు. లోక్సభ మాదిరిగానే, ఈ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో ప్రత్యేక సమావేశంలో దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదం పొందింది.
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే నారీ శక్తి వందన్ చట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో ఇప్పుడు చట్టంగా మారింది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మోడీ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. బిల్లుపై చర్చ అనంతరం ఉభయ సభల ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లులో నిబంధన ఉంది.
పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతికి పంపకముందే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గురువారం బిల్లుపై సంతకం చేశారు. లోక్సభ మాదిరిగానే, ఈ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో ప్రత్యేక సమావేశంలో దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదం పొందింది. అయితే ఈ చట్టం అమలులోకి రావడానికి సమయం పడుతుంది. ఎందుకంటే తదుపరి జనాభా లెక్కల తర్వాత, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల విభజన జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు సాగుతుంది. 2029లో ఈ చట్టం అమల్లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.