Bunny కొత్త సినిమా అని బిల్డప్ ఇచ్చారు.. అంతా తూచ్
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వచ్చే ఏడాది ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. క్రేజీ డైరెక్టర్‌తో బన్నీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది. అదంతా తూచ్ అని అప్పుడే తేలిపోయింది.
Bunny: అల్లు అర్జున్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో ఓ మూవీ ఫిక్సయినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘కభీ అప్నే కభీ సప్నే’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లుగా పోస్టర్లో కనిపించింది. ఇందులో అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపించాడు. ఒకటి క్లాస్, మరొకటి మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది అల్లు అర్జున్ బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ అనే కామెంట్స్ వినిపించాయి.
గతంలో క్రిష్ దర్శకత్వంలో వేదం సినిమా చేశాడు అల్లు అర్జున్. అందుకే.. మరోసారి వీరిద్దరి కాంబో సెట్ అయిందనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగతో సినిమాలు అనౌన్స్ చేశాడు బన్నీ. మరోవైపు క్రిష్ ‘హరిహర వీరమల్లు’ కంప్లీట్ చేయలేదు. ఇలాంటి సమయంలో ఈ క్రేజీ కాంబో ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది. దీని వెనక అసలు మ్యాటర్ వేరే ఉందని అనుకున్నారు. బహుశా ఇది ఓటీటీ కంటెంట్ అయ్యి ఉండవచ్చని భావించారు. లేదంటే యాడ్ అయి ఉంటుందని అనుకున్నారు.
అనుకున్నట్టే.. బన్నీ, క్రిష్ మ్యాటర్ అంతా తూచ్ అని తేలిపోయింది. రెడ్ బస్ యాడ్ కోసం అల్లు అర్జున్- క్రిష్ జాగర్లమూడి కలిసి పనిచేశారు. ఇందుకు సంబంధించిన యాడ్ రిలీజ్ అయ్యింది. రెడ్ బస్ కోసం క్రిష్.. రెండు రకాల యాడ్స్‌లో నటించాడు. ఇందులో అల్లు అర్జున్ ఎప్పటిలానే స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ప్రస్తుతం ఈ యాడ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.