డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై పలు రాష్ట్రల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి పడిపోయాయి. మూడు రోజుల నుంచి మంచు వర్షం కురుస్తూనే ఉండడంతో రహదారులన్నీ మూసివేశారు.
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో భాగంగా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్, సంగీత్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో జరుగుతున్న ఈ సంబరాలు అంబరాన్ని అంటాయి. తాజాగా సంగీత్ కార్యక్రమానికి ముందు నీతా-ముఖేష్ అంబానీలు ఓ వీడియోలో యాక్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీకి కొన్ని షరతులు పెట్టాడు. లిక్కర్ కుంభకోణంలో ఆరోపనలు ఎదుర్కొంటున్న ఈయన గత కొన్ని నెలలుగా ఈడీ విచారణకు గైర్హాజరవుతున్నారు. ఈ మేరకు ఈడీకి కొన్ని షరతులు పెట్టాడు. అలా అయితేనే విచారణకు హాజరవుతా అన్నారు.
డార్లింగ్ అని పిలవడం అసభ్యత కిందికి వస్తుందన్న హైకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈ మాటను లైగింక వేధించినట్లే అని సెక్షన్ 354ఏ, 509 కింద విచారించవచ్చునని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 29, 2023న జరిగిన ఘోర రైలు ప్రమాదానికి గల కారణాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం వెల్లడించారు. ఓ రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు అంబరాన్ని అంటాయి. గుజరాత్‌లోని జామ్ నగర్ మొత్తం ప్రముఖులతో నిండిపోయింది. ఈ వేడుకల్లో అనంత్ అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. అతను పెట్టుకున్న వాచ్ ధర తెలిసి మార్క్ జూకర్ బర్గ్ సైతం నివ్వెరపోయాడు.
లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 195 మందితో తొలి జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 34 మంది మంత్రులు.. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు లోక్‌సభ బరిలో నిలిచారు.
లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవిస్తున్న వివాహిత ముస్లిం మహిళ వేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. తనకు ప్రాణహాని ఉందని ఆ మహిళ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఎన్నికల వ్యూహాలను శరవేగంగా అమలు చేస్తోంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ తొలి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. చాలా మంది ప్రముఖులను ఈ పెళ్లికి ఆహ్వానించారు. ఆ ప్రముఖుల్లో రామ్ చరణ్ దంపతులకు దక్కిన స్వాగతం ఎలాంటిదో తెలుసుకుందాం.