పశ్చిమ బెంగాల్ జైళ్లలో మహిళా ఖైదీల గర్భం దాల్చిన వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ మేరకు కలకత్తా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికను కోరింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరుతో మోసం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. యోగి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిని చేస్తానని లక్నోకు చెందిన ఓ వ్యక్తి రూ.15 లక్షలు మోసం చేశాడు.
ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళ దినోత్సవం రోజున ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీల నిర్వహణపై నిషేధం విధించింది.
నమాజు చేసుకుంటున్న ఓ ముస్లిం యువకుడిని కాలితో తన్నిన పోలీసులు అధికారి వీడియో ఒక్కటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజనులు స్పందిస్తున్నారు.
మహాశివరాత్రి రోజున రాజస్థాన్‌లోని కోటాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ శివుడి ఊరేగింపులో 18 మంది పిల్లలు విద్యుదాఘాతంతో తీవ్రంగా కాలిపోయారు.
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. మహిళా దినోత్సవం వేళ దానిపై సబ్సిడీని మరో సంవత్సరం పాటు కొనసాగించనున్నట్లు తెలిపింది.
హోలీకి ముందే మోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ తెలిపింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో నక్సలైట్లు మరోసారి పిరికిపంద చర్యకు పాల్పడ్డారు. నక్సలైట్లు ఈ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడిని హత్య చేశారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గత కొన్ని రోజులుగా నిరంతరం వందలాది కోళ్లు చనిపోతున్నాయి. ప్రభుత్వ హేచరీ కేంద్రమే ఈ సమస్యతో సతమతమవుతోంది.
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి నేడు(గురువారం) విడుదలయ్యారు.
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టులో కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోదీ కశ్మీర్ లోయకు తొలిసారి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ ప్రకటనల్లో పాల్గొనవద్దని సెలబ్రిటీలను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హెచ్చరించింది.
ఢిల్లీ యూనివర్సిటీలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తం అయిన పోలీసులు బాంబు స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు.
వివాహితను ఇంటి పనులు చేయమని భర్త కోరడం క్రూరత్వం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక బంధంలో ఇద్దరు బాధ్యతలు పంచుకోవడం ముఖ్యమని కోర్టు తెలిపింది.