»Ccpa Dont Engage In Such Ads Centre Warns Celebrities
CCPA: అలాంటి ప్రకటనల్లో పాల్గోనవద్దు..సెలబ్రెటీలకు కేంద్ర సంస్థ హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ ప్రకటనల్లో పాల్గొనవద్దని సెలబ్రిటీలను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హెచ్చరించింది.
CCPA: కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల దృష్టి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వైపు వెళ్లే ప్రకటనలపై సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై నిఘా పెట్టింది. ఈ బెట్టింగ్ ప్రకటనల్లో పాల్గొనవద్దని సెలబ్రిటీలను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హెచ్చరించింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌తో సహా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఎండార్స్మెంట్ చేసినందుకు కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్ని వాటాదారులను హెచ్చరించింది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం బాగా పెరగడంతో ఆయా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంస్థలు ప్రముఖులతో ప్రమోషన్ యాడ్ చేయిస్తున్నారు.
ఇలా చేస్తే వాళ్లపై యాక్షన్ తీసుకుంటామని కేంద్ర సంస్థ హెచ్చరించింది. వినియోగదారుల రక్షణ చట్టం 2019కి అనుగుణంగా అడ్వైజరీ, వివిధ చట్టాల ప్రకారం అలాంటి ప్రకటనలు, ప్రచారం, ఆమోదాన్ని నిషేధించారని తెలిపారు. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్, 1867 ప్రకారం బెట్టింగ్, జూదం నిషేధించారు. వీటిని చట్టవిరుద్ధంగా పరిగణించారు. అయిన ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లు నేరుగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ను అలాగే గేమింగ్ ముసుగులో కొనసాగుతున్నాయని కేంద్ర సంస్థ ప్రకటించింది.