సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖుల వరకు ఈ డీప్‌ఫేక్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికోసం ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సమస్య తగ్గట్లేదు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ డీప్‌ఫేక్ బారినపడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా శివగిరి గ్రామ సమీపంలో పాత పూసయ్య ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగిన తర్వాత వేలంలో ఓ నిమ్మకాయ రూ.35 వేలు పలికింది.
రాజస్థాన్‌లోని పాలిలో జాతీయ రహదారిపై కారు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిన కారు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది.
Kuno National Park : కునో నేషనల్ పార్క్ నుండి శుభవార్త వెలువడింది. ఇక్కడ ఆడ చిరుత గామిని 5 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ట్విట్టర్‌లో తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో ఆదివారం ఓ ట్రక్కు కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ 2024 లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ పార్టీ జాబితాలో మొత్తం 42 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో శనివారం ఓ హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ మృతి చెందాడు.
కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన తొమ్మిది నెలల తర్వాత ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు వచ్చింది.
కుల గణన అంశాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి పునరుద్ఘాటించారు. ప్రతిరోజూ ఈ విషయంపై బీజేపీని కార్నర్ చేస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అస్సాం తర్వాత ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబమ్ తుకీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పుడు దేశమంతా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఓ హాస్టల్‌లో ఆహారం తిని 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులందరినీ గ్రెనోలోని ఆసుపత్రిలో చేర్చారు.
మధ్యప్రదేశ్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సురేశ్ పచౌరీ బీజేపీలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అస్సాంలో పర్యటిస్తున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్‌లో ఏనుగు సఫారీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే బీజేపీ దేశవ్యాప్తంగా 195 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఇదిలా ఉంటే అందరి చూపు కాంగ్రెస్ వైపు పడింది.