»Yogi Adityanath Cm Yogi Adityanath Deepfake Video Going Viral
Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్.. వైరల్ అవుతున్న వీడియో
సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖుల వరకు ఈ డీప్‌ఫేక్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికోసం ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సమస్య తగ్గట్లేదు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ డీప్‌ఫేక్ బారినపడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Yogi Adityanath: ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు డీప్‌ఫేక్. ఈ డీప్‌ఫేక్ బారిన ఎంతోమంది పడుతున్నారు. సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖుల వరకు ఈ డీప్‌ఫేక్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికోసం ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సమస్య తగ్గట్లేదు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ డీప్‌ఫేక్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డయాబెటిక్ ఔషధానికి ప్రచారం చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది.
మధుమేహ బాధితులు ఔషధాన్ని కొనుగోలు చేయాలంటూ ఆదిత్యనాథ్ ప్రోత్సహిస్తున్నట్లు వీడియోలో ఉంది. అయితే హజ్రత్‌గంజ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా వీడియో సృష్టించిన వాళ్లను గుర్తించనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్, ఆలియా భట్ వంటి స్టార్ నటులు కూడా ఈ డీప్‌ఫేక్ బారిన సంగతి తెలిసిందే.