A policeman kicked a Muslim youth who was praying in Delhi.. Video went viral
Viral Video: ఢిల్లీ(Delhi)లోని ఇంద్రలోక్ ప్రాంతంలో రోడ్డుపై పలువురు ముస్లింలు నమాజ్(Namaj) చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా చెప్పారు. వాళ్లు వినకుండా అలానే నమాజు చేసుకుంటున్నారు. అక్కడికిి వచ్చిన కొంత మంది పోలీసులు వారితో మాట్లాడుతున్న సమయంలో ఒక అధికారి ప్రార్థన చేసుకుంటున్న ఓ యువకుడిని కాలితో తన్నాడు. తరువాత అతని ముందున్న మరో వ్యక్తిని కాలితో తన్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారించాడు. అక్కడున్న ముస్లింల గుంపు ఆ అధికారితో వాదనకు దిగారు. అయితే చాలా కాలంగా ఆ ప్రాంతంలోని రోడ్డుపై నమాజు చేయవద్దని, ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు చెప్తున్నారట. అయినా సరే ప్రతీ శుక్రవారం ఇది రిపీట్ అవడంతో పోలీసులు ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఏదేమైనా ఓ బాధ్యత గల అధికారి కాలితో తన్నడం సరైన విధానం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
34 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను అక్కడే ఉన్న వ్యక్తి రికార్డ్ చేశాడు, పోలీసు అధికారి ముస్లింలను అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆ వీడియో రికార్డు చేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పోలీసును ముస్లిం గుంపు చుట్టిముట్టిన తరువాత అతన్ని కొట్టండి, తన్నండి అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. కొంత ఇది సరైన పద్దతి కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు దేశంలో 6 లక్షలకు పైగా మసీదులు ఉన్నాయి, అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఇలా రోడ్డుపై ఎందుకు అని అంటున్నారు. ఇలా చేసిన పోలీసులకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే వైరల్ అయిన దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని, అవసరమైన చర్యలు తీసుకుంటామని నార్త్ డీసీపీ తెలిపారు.
A Delhi Police Official is seen kicking Muslims offering prayers. This is an extreme action of hate by the police official without cause. #DelhiPolicepic.twitter.com/vB730FZ1P7