»Kejriwal Has Given Conditions Only If He Attends The Ed
Aravind Kejriwal: అలా అయితేనే ఈడీకి హాజరవుతా.. షరతులు పెట్టిన కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీకి కొన్ని షరతులు పెట్టాడు. లిక్కర్ కుంభకోణంలో ఆరోపనలు ఎదుర్కొంటున్న ఈయన గత కొన్ని నెలలుగా ఈడీ విచారణకు గైర్హాజరవుతున్నారు. ఈ మేరకు ఈడీకి కొన్ని షరతులు పెట్టాడు. అలా అయితేనే విచారణకు హాజరవుతా అన్నారు.
Kejriwal has given conditions only if he attends the ED
Aravind Kejriwal: మధ్యం కుంభకోణం కేసులో ఈడీ సమన్లను తిరస్కరిస్తూ వస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా హాజరుకావడానికి ఒప్పకున్నారు. ఈ మేరకు ఈడీకి తన షరతులు వెల్లడిస్తూ లేఖ రాసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా మార్చి 12 తరువాతే ఈడీ ముందు హాజరుకానున్నట్లు తెలిపారు. అది కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా నవంబర్ 2న మొదటి సారి కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఆ తరువాత వరుసగా సమన్లు పంపుతూ వచ్చింది. వాటన్నింటిని కేజ్రీవాల్ తిరస్కరించారు.
చివరిగా మర్చి 4న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. ఈ సంస్థ దర్యాప్తు సమన్లు చట్టవిరుద్దం అని, అయినా సరే విచారణకు హాజరు అవుతా అని కానీ మార్చి 12 తరువాత అని వెల్లడించారు. ఈ కుంభకోణంలో కేసులో సీఎంకు సమన్లు పంపినా ప్రయోజనం లేకపోవడంతో, ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మార్చి 16న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అవమని కోర్టు తీర్పు వెలవరించింది. ఈ రోజు కేజ్రీవాల్ వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకానున్నారు.