»Mukesh Ambani As Don In Ananth Radhikha Pre Wedding Video Viral
Mukesh Ambani: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్‌లో డాన్ పాత్రలో ముఖేష్ అంబానీ.. వీడియో వైరల్
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో భాగంగా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్, సంగీత్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుజరాత్‌లోని జామ్ నగర్లో జరుగుతున్న ఈ సంబరాలు అంబరాన్ని అంటాయి. తాజాగా సంగీత్ కార్యక్రమానికి ముందు నీతా-ముఖేష్ అంబానీలు ఓ వీడియోలో యాక్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.
Mukesh Ambani as Don in Ananth-Radhikha Pre Wedding Video Viral
Mukesh Ambani: డబ్బుంటే కొండమీది కోతిని కొనుక్కు రావచ్చు అన్న మాట గుర్తుంది కదా.. నిజంగా డబ్బుకు అంతటి మహిమ ఉంది. తాజాగా అంబానీ(Ambani Family) ఇంట్లో జరుగుతున్న హడావిడీ చూస్తుంటే అర్థం అవుతుంది. ఒక వివాహ కార్యక్రమానికి రూ. వెయ్యి కోట్లు అంటే మాములు విషయం కాదు. ఇక గుజరాత్‌లోని జామ్ నగర్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకల్లో హాలీవుడ్, బాలీవుడ్ తారాల సందడీ ఎంతో వైభవంగా సాగుతుంది. రిహన్న స్టేజ్ ఫర్ఫార్మెన్స్, ఖాన్ల డ్యాన్స్ చూసేవాళ్లకు కన్నుల పండుగగా ఉంది. ఇక మరో పాప్ సింగర్ అకాన్ను సైతం పిలిపించారు. వీటి నడుమ ముఖేష్, నీతా అంబానీ యాక్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
సంగీత్ కార్యక్రమానికి ముందు ఈ వీడియోను ప్లే చేశారు. అతిథులు అందరూ ఆసీనులై ఉండగా.. డాన్ పాత్రలో ముఖేష్ అంబానీ దర్శనించారు. చెస్ ఆడుతూ చాలా సీరియస్ ఉన్న ముఖేష్ అంబానీని పిలవడానికి నీతా అంబానీ వస్తుంది. ఏంటి అని కన్నులతో సైగ చేస్తాడు, మన చిన్న కుమారుడు సంగీత్ కార్యక్రమానికి టైమ్ అవుతుంది. అతిథులందరూ వెయిట్ చేస్తున్నారు త్వరగా రండి అంటుంది. వెంటనే ఎస్ బాస్ అంటూ ముఖేష్ అంబానీ లేస్తాడు. ఈ ఫన్నీ వీడియోను చూసి అందరూ నవ్వుతూ క్లాప్స్ కొట్టారు. సంగీత్ కార్యక్రమం ప్రారంభం అయింది. ప్రస్తుం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.