ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. లా కమిషన్ 2029 నుంచి జమిలి ఎన్నికలు జరిగేలా రాజ్యాంగంలో కొత్త చాప్టర్ చేర్చాలని సిఫారసు చేసింది.
రెండవసారి క్యాన్సర్ రాకుండా టాటా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు అతి తక్కువ ధరకే టాబ్లెట్‌ను ఆవిష్కరించారు. అతి త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు టాటా ఇన్సిస్టిట్యూట్ వైద్యులు తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధనారంగంలో మానవ అంతరిక్షయాత్ర కోసం గగన్‌యాన్ కోసం నలుగురు వ్యోమగాముల పేర్లను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే మలయాళ నటి లీనా ఈ సందర్భంగా ఓ పోస్ట్ చేశారు.
అయోధ్య హనుమాన్ గఢీ ఆలయ ప్రసాదం ఇక నుంచి నేరుగా మన ఇంటికే వచ్చేస్తుంది. ‘ఈ మనీ ఆర్డర్’ ద్వారా డబ్బులు పంపిస్తే ఆన్‌లైన్‌లో నేరుగా మన ఇళ్లకు ప్రసాదం వచ్చేస్తుంది.
భారతీయ నౌకదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరీ భారీ డ్రగ్స్‌ను సీజ్ చేసింది. సుమారుగా 3,300 కేజీల మాదకద్రవ్యాల్ని పట్టుకుంది. గుజరాత్‌లోని పోరుబందర్ తీరంలో ఆ డ్రగ్స్‌ను సీజ్ చేసింది.
యోగా గురు రామ్ దేవ్ బాబాకు సంబంధించిన పతంజలి ఆయుర్వేద సంస్థపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మందులు పలు జబ్బుల్ని తగ్గిస్తాయంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాటిని ఖాతరు చేయనందుకుగాను కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించి బయటకు వచ్చిన శ్రీలంక వ్యక్తి సంథాన్ రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు.
ఒకటో తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్లు తప్పనిసరి అనే నూతన విద్యా విధానం ప్రవవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.
జియో నెట్‌వర్క్‌కు నాయకత్వం వహిస్తున్న ముఖేష్ అంబానీ ఇప్పుడు OTT దిగ్గజం డిస్నీ వాటాలను కొనుగోలు చేయడం ద్వారా తన OTT నెట్‌వర్క్‌ను విస్తరించాలని చూస్తున్నారు.