మన దేశంలో తొలిసారిగా మానవ సహిత స్పేస్ మిషన్ ‘గగనయాన్’ను ప్రయోగించనున్నారు. దానిలో అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు భారతీయ వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు.
సాధారణంగా మనుషులకు మాత్రమే పెళ్లిళ్లు జరగకుండా కుక్కలు, గాడిదలు వంటి జంతువులకు కూడా పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. అయితే ఓ కేరళలోని కోజికోడ్ జిల్లాలో కొడియత్తూరు గ్రామస్థులు దీనికి భిన్నంగా రోడ్డుకు పెళ్లి చేశారు. అసలు రోడ్డుకి పెళ్లి చేయడం ఏంటి? ఎందుకు చేశారో? వివరాల్లో తెలుసుకుందాం.
బాడీ బిల్డింగ్ కోసం అవసరమైన జింక్ శరీరానికి పొందాలనే ఉద్దేశంతో ఓ పేషెంట్ నాణాలు, మ్యాగ్నెట్లు తిన్నాడు. కడుపులో నుంచి 38 నాణాలు, 37 మ్యాగ్నెట్లను సర్జరీ చేసి తీశారు.
ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి ఏ మాత్రమూ కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటరు కార్డు లేదా ఇతర ఏ నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని అయినా చూపించి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వెల్లడించింది.
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచం నడుస్తోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో , లాక్ డౌన్ లో ప్రజలను అలరించడంలో ఓటీటీలు కీలక పాత్రపోషించాయి. అయితే.. తెలుగులో పుట్టుకొచ్చిన ఏకైక ఓటీటీ ఆహా.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లోని అష్టభుజ దేవి ఆలయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. సోమవారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేసేందుకు తలుపులు తెరిచి చూడగా అక్కడ ఓ చిన్నారి పాదముద్రలు కనిపించాయి.
భారతీయ సంపన్నుల్లో అగ్రగణ్యుడైన ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో జరగనున్నాయి. వీటికి హాజరయ్యే అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులందరికీ అల్ట్రా లగ్జరీ టెంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని శిలిగుడి సఫారీ పార్కులో అక్బర్, సీత పేర్లు పెట్టిన మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడం ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.
బీజేపీ కార్యకర్త ఒకరు చెన్నైలో నడుపుతున్న ‘మోదీ ఇడ్లీ’ దుకాణానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రూ. పదికే మూడు ఇడ్లీలను దుకాణదారుడు ఇస్తుండటంతో స్థానికులు ఆసక్తిగా వీటిని కొనుగోలు చేసి తింటున్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన 27 కిలోల నగలను త్వరలో వేలం వేయనున్నారు. ఆమె చెల్లించాల్సిన జరిమానాలు చెల్లించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) రాష్ట్ర అధ్యక్షుడు, బహదూర్‌గఢ్ మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠీపై దాడి జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఆదివారం ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ యజమాని కూడా మృతి చెందాడు.