»Rajgarh Ashtabhuja Mata Temple Miracle Footprints Of Devimata Seen Worship Started
Madhyapradesh : అమ్మవారి ఎర్రటి పాదముద్రలు.. భారీగా తరలివస్తున్న భక్త జనం
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లోని అష్టభుజ దేవి ఆలయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. సోమవారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేసేందుకు తలుపులు తెరిచి చూడగా అక్కడ ఓ చిన్నారి పాదముద్రలు కనిపించాయి.
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లోని అష్టభుజ దేవి ఆలయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. సోమవారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేసేందుకు తలుపులు తెరిచి చూడగా అక్కడ ఓ చిన్నారి పాదముద్రలు కనిపించాయి. ఈ పాదముద్రలు మాతా విగ్రహం వైపు వచ్చి అక్కడి నుంచి తిరిగి వస్తున్నట్లు ఉన్నాయి. ఈ వార్త దావానలంలా ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఈ పాదముద్రలను చూసేందుకు, పూజించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ సంఘటన రాజ్‌గఢ్ జిల్లాలోని బియోరాలో ఉన్న జోగి ప్రాంతంలోని పురాతన, రాచరికపు హనుమాన్ దేవాలయం, శివాలయంలో జరిగింది. కొద్ది రోజుల క్రితం ఈ ఆలయం పునరుద్ధరించబడింది. గుప్త నవరాత్రుల సమయంలో ఆచారాల ప్రకారం అష్టభుజ మాత విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు.
రోజూలాగే సోమవారం ఉదయం కూడా అదే ప్రాంతంలో నివసించే సోను జోగి ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వచ్చారు. తెర తెరవగానే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. చిన్న చిన్న ఎర్రటి పాదముద్రలు కనిపించాయి. ఓ చిన్నారి అమ్మవారి విగ్రహం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోను వెంటనే ఆ ప్రాంతంలోని ఇతర వ్యక్తులకు తెలియజేశాడు. దీని తరువాత ప్రజలు దీనిని అద్భుతంగా పేర్కొన్నారు. ఆలయంలో శ్లోకాలు, కీర్తనలు పాడటం ప్రారంభించారు. ఈ వార్త గ్రామంలోకి చేరిన వెంటనే ఆ ప్రాంతమంతా దావానంలా వ్యాపించింది. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు అమ్మవారి దర్శనం, పూజలు చేయడానికి ఈ ఆలయానికి వస్తున్నారు. ఈ సిద్ధ మందిరంపై చాలా మందికి ఉన్న విశ్వాసం వల్ల చాలా దూరం నుండి భక్తులు వస్తున్నారు. ఈ అద్భుతం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇక్కడ భక్తుల సంఖ్య వేగంగా పెరిగింది.