మద్యం అమ్మకాల విషయంలో మధ్యప్రదేశ్( Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాష్ట్రంలో బార్లను మూసేయనున్నట్లు తెలిపింది. వైన్స్ షాపు ( Whines shop) లో మద్యం అమ్మకాలు మాత్రమే జరుగుతాయని అక్కడ కుర్చుని తాగేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం, అదానీ కుంభకోణం బయటకు రావడంతో బీజేపీ నిరాశకు గురవుతోంది. వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు ఈడీ సోదాలు చేపట్టింది. పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న సమయాన దాడులు జరిగాయి. అయితే ఇవేవీ మమ్మల్ని అడ్డుకోలేవు’ అని పేర్కొన్నారు.
గతంలో నీళ్ల ట్యాంకులు, గుంతల్లో పడడం.. నూనె, సాంబారు తదితర వాటిల్లో పిల్లలు పడిన సంఘటనలు జరిగాయి. కానీ వాషింగ్ మెషీన్ లో బాలుడు పడిన సంఘటన బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. అయినా పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కొంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. పనులు చేస్తున్నప్పుడు పిల్లలపై కూడా కన్నేసి ఉండాలి. లేదంటే ఘోర ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే మనకే మేలు.
దేశ రాజధాని ఢిల్లీలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇంటిపై దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన అసదుద్దీన్. న్యూఢిల్లీలోని అశోకా రోడ్ ప్రాంతంలోని ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు, రాళ్లు విసిరి కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఢిల్లీలోని ఆయన నివాసం పై ఈ తరహా దాడి జరగడం ఇది నాలుగోసారి.
కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్టీ సింబల్ విషయంలో తమకు ఏం జరిగిందో అన్ని పార్టీలు చుసాయని, ఇప్పటికైనా బీజేపీతో కలవాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచింది అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గం అసలైన శివసేన గా గుర్తించిన ఎన్నికల కమిషన్ ఆ వర్గానికి పార్టీ సింబల్ విల్లు - బాణం గుర్తును కేటాయించింది
తమిళనాడులోని మహాబలిపురం (Mahabalipuram) సమీపంలోని పత్తిపులం గ్రామంలో నిర్వహించిన మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై (Tamilisai) హాజరయ్యారు. ఆమె నడుస్తూ వేదిక వైపు వస్తూ ఉండగా…. కార్పెట్ మీద ఒక్కసారిగా జారి కిందపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగులకు కేరళ (kerala) సర్కారు షాకిచ్చింది. ఇకపై వారు ఎలాంటి యూట్యూబ్ (youtube) చానళ్లు నిర్వహించారాదని ఆర్డర్ (orders) జారీ చేసింది. ఉద్యోగులు అలా చేయడం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందంటు రీసెంట్ గా రిలిజ్ చేసిన జోవోలో తెలిపింది.
శివసేన (shiv Sena) పార్టీలోని ఉద్ధవ్ థాక్రే గ్రూప్ కు (Uddhav Thackeray) చెందిన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut)ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ గుర్తు కోసం 2000 కోట్లు చేతులు మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు.
GST పెండింగ్ బకాయిలను రాష్ట్రాలకు వెంటనే క్లియర్ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు.
సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ 6 వికెట్లతో సౌరాష్ట్రను ఆదివారం బెంగాల్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించడానికి మార్గనిర్దేశం చేశాడు. దీంతో నాల్గవ రోజున మూడు సీజన్లలో రెండో టైటిల్ ను బెంగాల్ పై విజయం సాధించి గెలుపొందారు. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్‌లో రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర గెలుపొందింది.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 25,000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ రికార్డులను అధిగమించాడు.
భారత్ లో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు(Aadhar Card)ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇందుకోసం యూఐడీఏఐ(UIDAI) ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. ఆధార్ కేంద్రాల ద్వారా అన్ని సేవలను అందుబాటులోకి ఉంచింది. అయితే పిల్లలకు సంబంధించి కొన్ని నిబంధనలను యూఐడీఏఐ తీసుకొచ్చింది.
డబ్బు, అభరణాలతో హైవేపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటీవల గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఓ డెలివరీ వ్యాన్‌లో ఉన్న రూ.3.88 కోట్ల విలువైన 1400 కిలోల వెండి, ఇతర ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఆ క్రమంలో డ్రైవర్, క్లినర్లపై దాడి చేసి అభరణాలు ఎత్తుకెళ్లారు.
మీరెప్పుడైనా ఐస్‌క్రీమ్ పానీపూరీ తయారు చేయడం చుశారా? లేదా అయితే ఈ వీడియోను చూసేయండి. సరికొత్తగా ట్రై చేసిన ఈ వంటకం వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది.