భారత్ లో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు(Aadhar Card)ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇందుకోసం యూఐడీఏఐ(UIDAI) ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. ఆధార్ కేంద్రాల ద్వారా అన్ని సేవలను అందుబాటులోకి ఉంచింది. అయితే పిల్లలకు సంబంధించి కొన్ని నిబంధనలను యూఐడీఏఐ తీసుకొచ్చింది.
భారత్ లో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు(Aadhar Card)ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇందుకోసం యూఐడీఏఐ(UIDAI) ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. ఆధార్ కేంద్రాల ద్వారా అన్ని సేవలను అందుబాటులోకి ఉంచింది. అయితే పిల్లలకు సంబంధించి కొన్ని నిబంధనలను యూఐడీఏఐ తీసుకొచ్చింది. పిల్లల ఆధార్ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్ నంబర్లను దరఖాస్తు ఫారంలో తప్పనిసరిగా నింపాలని యూఐడీఏఐ(UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది.
List of Acceptable Supporting Documents for Aadhaar Enrolment/Update is now available in a more Simplified Version !
పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు ఇద్దరి ఆధార్ నంబర్ల(Aadhar Numbers)తో నమోదుతో పాటుగా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ బయోమెట్రిక్(Aadhar Biometrics)ను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా బయోమెట్రిక్ తో కూడిన ఆమోదం తెలియజేస్తేనే పిల్లలకు ఆధార్ కార్డు(Aadhar Card)ను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ యూఐడీఏఐ(UIDAI) డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకరన్ ఆదేశాలిచ్చారు.
ఐదేళ్లలోపు పిల్లలకు కొత్తగా ఆధార్ కార్డు(Aadhar Card) జారీ చేసేందుకు లేదా వారి వివరాలను ఆధార్ లో అప్ డేట్ చేసేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫారంతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని యూఐడీఏఐ(UIDAI) వెల్లడించింది. ఐదేళ్లకు పైబడి 18 ఏళ్ల మధ్య ఉండేవారికి వేరే దరఖాస్తు ఫారం ఉంటుందని తెలిపింది. దానికి సంబంధించిన మరో కొత్త దరఖాస్తు నమూనా ఫారంను యూఐడీఏఐ(UIDAI) రిలీజ్ చేసింది. ఇకపోతే 18 ఏళ్లకు పైబడిన వారికి ఇంకో ఫార్మాట్ లో దరఖాస్తు ఫారం తీసుకొచ్చినట్లు వెల్లడించింది. మూడు రకాల దరఖాస్తు ఫారాల నమూనాలను యూఐడీఏఐ(UIDAI) రిలీజ్ చేసింది. ఇకపై వీటి ద్వారానే ఆధార్ కార్డులు పొందాలని యూఐడీఏఐ(UIDAI) ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15వ తేది నుంచి ఈ మూడు రకాల ఫారాల విధానం అమలులో ఉంటుందని వెల్లడించింది. దరఖాస్తు ఫారాలను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు యూఐడీఏఐ(UIDAI) తెలిపింది.