GST పెండింగ్ బకాయిలను రాష్ట్రాలకు వెంటనే క్లియర్ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
అన్నారు. 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ బకాయిలు రూ.16,982 కోట్లను శనివారం నుండే చెల్లిస్తామన్నారు. జూలై 2017 నుండి ఐదేళ్ల బకాయిలను ఆయా రాష్ట్రాలకు కేంద్రం చెల్లిస్తుంది. ఈ మొత్తం నిజంగా నష్టపరిహార నిధిలో అందుబాటులో లేనప్పటికీ, తమ సొంంత వనరుల నుండి విడుదల చేయాలని నిర్ణయించుకున్నామన్నట్లు తెలిపారు. అలాగే ఈ మొత్తాన్ని ఫ్యూచర్ కాంపెన్సేషన్ నుండి తిరిగి పొందుతామన్నారు. పలు వస్తువులపై వస్తు సేవల పన్ను (GST) తగ్గిస్తున్నట్లు తెలిపారు.
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ట్యాగ్లు, ట్రాకింగ్ పరికరాలు లేదా డేటా లాగర్స్పై జీఎస్టీ తొలగింపు, అంతకుముందు 18 శాతం
బొగ్గు వాషరీకి లేదా వాటి ద్వారా సరఫరా చేయబడిన కోల్డ్ రిజెక్ట్స్ పై కూడా జీఎస్టీ ఉండదు. పెన్సిల్ షార్పనర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ద్రవ బెల్లంపై జీఎస్టీ తొలగింపు, అంతకుముందు ఇది 18 శాతంగా ఉంది. ప్యాక్ చేసిన ,లేబుల్డ్ లిక్విడ్ బెల్లంపై జీఎస్టీ18 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు. పాన్ మసాలా, గుట్కాపై సామర్థ్య ఆధారిత పన్ను విధింపుపై మంత్రుల బృందం (GoM) సిఫార్సును GST కౌన్సిల్ ఆమోదించింది.
GST కౌన్సిల్ సమావేశం నిర్ణయాల అనంతరం వివిధ ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయి. మరికొన్నింటి ధరలు తగ్గుతున్నాయి.
తగ్గేవి.. లిక్విడ్ జాగ్గెరీ, పెన్సిల్స్, షార్పనర్స్, డేటా లగ్గర్స్, కోల్ రేజెక్ట్స్, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఫీజ్, మిల్లెట్స్ పైన టాక్స్ మినహాయింపు వంటివి తగ్గనున్నాయి. అదే సమయంలో పాన్ మసాలా, గుట్కా, చూయింగ్ టొబాకో, కోర్టు సర్వీసెస్ ఖరీదు కానున్నాయి.