తన తల్లి స్మృత్యార్థం ఫౌండేషన్ ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాడు. కరోనా సమయంలో దేవుడిలా సోనూ సూద్ ప్రజలకు సేవలు అందించాడు. ఆర్థిక, వైద్య, విద్య అన్ని రకాల సహాయ కార్యక్రమాలు సోనూ సూద్ చేశాడు.. చేస్తున్నాడు.. ఇంకా చేస్తాడు. అయితే సోనూసూద్ సేవా కార్యక్రమాలపై రాజకీయంగా వివాదం కొనసాగుతోంది.
సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శివరాత్రి పర్వదినం రోజున శివైక్యం పొందారు.
తారకరత్న అకాల మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హీరో నందమూరి తారకరత్న(Taraka Ratna) కన్నుముశారు. ఈ క్రమంలో బెంగళూరు(bangalore) నుంచి హైదరాబాద్(hyderabad)కు తీసుకొచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు(family members) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా అభిప్రాయం వ్యక్తం చేశారు. అతను ఇండియా ఒక ఆస్తి అని, ఇండియా ప్రైడ్ అంటు చెప్పుకొచ్చారు. తాజాగా ముంబయి ఎయిర్ పోర్టులో ఓ ఫోటోగ్రాఫర్ రిషబ్ గురించి అడుగగా ఇలా స్పందించారు.
ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో తమిళనాడులో తొలిసారిగా చీరకట్టులో వాకింగ్(saree walkathon) పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు వేల మందికిపైగా అనేక వయస్కులైన మహిళలు పాల్గొన్నారు.
ఎక్కువగా అబ్బాయిలు తమకు ప్రేమించడానికి సరైన అమ్మాయి దొరకడం లేదని ఆవేదన చెందిన సంఘటనలు విన్నాం. కానీ అమ్మాయిలు ఎప్పుడైనా బాయ్ ఫ్రెండ్ లేడని ఏడ్చిన సంఘటనలు విన్నారా? లేదా అయితే ఇక్కడ మాత్రం అదే జరిగింది. ఈ సంఘటన చైనా షాంఘైలో జరిగింది.
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు ప్రభుత్వం మధ్య శనివారం తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, ఓలా సిఇఒ భవిష్ అగర్వాల్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీ కోసం తమిళనాడులో 920 మిలియన్ డాలర్లు (రూ. 7,614 కోట్లు) ఓలా పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమాలోని వేర్ ఇస్ ది పార్టీ పాటకు స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన దైన స్టైల్లో స్టెప్పులు వేసిన ఈ వీడియోను సింధు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా..ఇప్పటికే 3 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.
పర్యావరణాన్ని సమతుల్యం చేసే లక్ష్యంతో గతంలో ఆఫ్రికా దేశాల నుంచి చిరుతలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కాకపోతే ఈ ప్రక్రియ అనేక కారణాలతో ఆగిపోయింది. 71 ఏళ్ల తర్వాత నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధతో చీతాలను భారతదేశానికి రప్పించారు.
pawar Advice To Uddhav:ఉద్దవ్ థాకరేకు (Uddhav Thackeray) ఎన్నికల సంఘం (ec) షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ పేరు, గుర్తుకు సంబంధించి ఉద్దవ్ థాకరే (Uddhav Thackeray) సుప్రీంకోర్టులో (supreme court) సవాల్ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల సంఘం నిర్ణయం ఒక్కసారి ప్రకటించిన తర్వాత ఇక దానిపై చర్చ అనవసరం అని శరద్ పవార్ సూచించారు.
బీఆర్‌ఎస్ (BRS) ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని సుప్రీం కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.! అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు (CBI) సీబిఐ కి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ఈ నెల 7న సుప్రీం కోర్టు తలుపు తట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)ఈ నెల 8న విచారణ చేపట్టింది.
సుప్రీంకోర్టులో(Supreme Court) కేజ్రీవాల్ పార్టీ ఆప్ కు పెద్ద ఊరట లభించింది. మేయర్ (Mayor) ఎన్నికలకు సంబంధించి బీజేపీ, ఆప్ ల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. నామినేటెడ్ మెంబర్ల సాయంతో మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని బీజీపీ (bjp) యత్నిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.
EC allots Shiv Sena name to shinde:శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే ( bal Thakeray) కుమారుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరేకు ( Uddhav Thakeray) కేంద్ర ఎన్నికల సంఘం (ec) షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేదే (ekanth shinde) అసలైన శివసేన అని అధికారికంగా గుర్తించింది.
కర్ణాటక (Karnataka) సీఎం బసవరాజు బొమ్మై ప్రభుత్వనికి కాంగ్రెస్ (Congress) నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెవిల్లోకి పువ్వులతో కనిపించారు. మాజీ సీఎం విపక్ష నేత సిద్దరామయ్య (Siddaramaiah) తోపాటు మరికొంత ఎమ్మేల్యేలు చెవిలో పూలు పెట్టుకుని సభకు వచ్చారు.