»Saree Walkathon Competition 2 Thousand Women Participate At Tamilnadu Thanjavur
Saree Walkathon: చీరకట్టులో 2 వేల మంది మహిళల వాక్ థాన్
ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో తమిళనాడులో తొలిసారిగా చీరకట్టులో వాకింగ్(saree walkathon) పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు వేల మందికిపైగా అనేక వయస్కులైన మహిళలు పాల్గొన్నారు.
సాధారణంగా ఒకేసారి 100 మంది మహిళలు చీర కట్టుకుని వస్తేనే క్రేజీగా అనిపిస్తుంది. అలాంటిది రెండు వేల మంది ఒకేసారి చీరలు కట్టుకుని నడిస్తే మాములుగా ఉండదు. అవును ఈ కార్యక్రమం ఇన్నర్ వీల్ క్లబ్(inner wheel club) ఆధ్వర్యంలో తమిళనాడు(tamilnadu)లో తొలిసారిగా చీరకట్టులో వాకింగ్(saree walkathon) పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో 2 వేల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.
ఈ పోటీలను జిల్లా కలెక్టర్ దినేష్ పొన్రాజ్ ఆలివర్, మేయర్ రామనాథన్, మున్సిపల్ కమిషనర్ శరవణకుమార్ ప్రారంభించారు. ఇందులో 18 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు 4 కి.మీ.లు, 36 నుంచి 59 ఏళ్లలోపు మహిళలు(womens) 3 కి.మీ దూరం, 60 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 1 కి.మీ దూరం నడిచారు. వయస్సుల వారీగా పోటీలు నిర్వహించారు.
తంజావూరు( thanjavur) ఇన్నర్ వీల్ క్లబ్(inner wheel club) 1973 – 2023 స్వర్ణోత్సవ సందర్భంగా సాంప్రదాయ దుస్తులకు గౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రొగ్రామ్ నిర్వహించారు. తంజావూరు(thanjavur) మహా దేవాలయం ముందు నుంచి చీర నడక(saree walkathon) పోటీ జరిగింది. పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి గోల్డెన్ జూబ్లీ కమిటీ అధ్యక్షురాలు ఉషా నందినితోపాటు 2000 మందికి పైగా హాజరయ్యారు.