మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమాలోని వేర్ ఇస్ ది పార్టీ పాటకు స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన దైన స్టైల్లో స్టెప్పులు వేసిన ఈ వీడియోను సింధు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా..ఇప్పటికే 3 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.
స్పోర్ట్స్ స్టార్‌గా పీవీ సింధు(PV Sindhu)కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనకు సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు ఉన్నంత మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్(instagram)లో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. బ్యాడ్మింటన్ కోర్టులో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే పీవీ సింధు…మంచి హ్యాపీ మూడ్ లో ఉంటే సూపర్ హిట్ పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేస్తుంది. ఇప్పటికే కచ్చా బాదంతో పాటు లేటెస్ట్ అరబిక్ పాటకు కూడా డాన్స్ చేసింది. మరోవైపు ఇటీవల గుజరాత్(gujarat) సంప్రదాయ దుస్తులు ధరించింది. దీంతోపాటు తాను ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలోని వేర్ ఇస్ దా పార్టీ పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులు వేసింది. ఆ వీడియోను సింధు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అది చూసిన పలువురు అభిమానులు మీరు సినిమాల్లో నటించాలని కామెంట్లు చేస్తున్నారు. మేడమ్ సార్ అంతే మీరు సూపర్ అంటూ ఇంకొంత మంది అంటున్నారు.
మెగాస్టార్(mega star) చిరంజీవి అంటే సినీ అభిమానులు, ప్రేక్షకులు మాత్రమే కాదు స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇష్టపడతారు. చిరంజీవి(chiranjeevi) నుంచి సినిమా వస్తే మొదటి రోజు చూసి టాక్ తెలుసుకోవాలని కూడా ఆతృతగా ఉంటారు. ఇటీవల చిరంజీవి నుంచి వచ్చిన వాల్తేరు వీరయ్య ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని బాస్ సాంగ్ వైరల్ అయ్యింది. సోషల్ మీడియా(social media)లో యువకులు, పెద్దలు ఈ పాటకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు కూడా బాస్ పాటకు అద్భుతమైన స్టెప్స్ వేసి తన మెగా అభిమానులను, ఫాలోవర్లను ఆకట్టుకుంది. బ్లూ కలర్ లెహంగా డ్రెస్స్‌లో స్టైలిష్‌గా ఉన్న సింధు ఈ పాటకు స్టెప్పులేసి మరింత అందం తీసుకొచ్చింది. డ్యాన్స్ వీడియోను సింధు ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఇది వైరల్(viral video)గా మారింది. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 3,33,380 లక్షల మంది ఈ వీడియోను ఇష్టపడగా. . వేలకొద్ది మంది కామెంట్లు చేస్తున్నారు.