»Urvashi Rautela React Rishabh Pant Health Condition Asset For Country
Urvashi Rautela: రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలి..అసెట్ ఫర్ కంట్రీ
భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా అభిప్రాయం వ్యక్తం చేశారు. అతను ఇండియా ఒక ఆస్తి అని, ఇండియా ప్రైడ్ అంటు చెప్పుకొచ్చారు. తాజాగా ముంబయి ఎయిర్ పోర్టులో ఓ ఫోటోగ్రాఫర్ రిషబ్ గురించి అడుగగా ఇలా స్పందించారు.
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా(urvashi rautela) రిషబ్ పంత్(rishabh pant) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శుక్రవారం ముంబయి(mumbai) ఎయిర్ పోర్టులో రెడ్ కలర్ డ్రెస్సులో దర్శనమిచ్చింది. ఆ క్రమంలో ఓ ఫోటోగ్రాఫర్ పంత్ ఆరోగ్యం గురించి ఊర్వశిని అడుగగా..అతను మన దేశానికి ఒక ఆస్తి, ఇండియాస్ ప్రైడ్ అని తెలిపింది. రిషబ్ శస్త్రచికిత్స తర్వాత అతను మొదటిసారి నడుస్తున్నట్లు కనిపించిన చిత్రం గురించి ప్రస్తావించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారత క్రికెట్ జట్టు స్టార్‌కి తమ ప్రార్థనలు ఉన్నాయని ఆ ఫోటోగ్రాఫర్ చెప్పినప్పుడు, ఆమె “హుమారీ భీ (నాది కూడా)” అని బదులిచ్చారు.
డిసెంబరు 30న పంత్ ఢిల్లీ(delhi) నుంచి ఉత్తరాఖండ్ కు వెళ్లే క్రమంలో రూర్కీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం(road accident)లో యువ క్రికెటర్ పంత్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా అతని కారు(car) మంటల్లో చిక్కుకున్నప్పటికీ, పంత్ మాత్రం సురక్షితంగా తప్పించుకోగలిగాడు. అప్పటి నుంచి అతను అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. ఈ క్రమంలో అతని కాలిన గాయాలు కూడా క్రమంగా మెరుగుపడుతున్నాయి. అతను గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడానికి 6-9 నెలల సమయం పడుతుందని వైద్యులు అంచనా వేశారు. ఈ క్రమంలో 2023లో జరగనున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్, ODI ప్రపంచ కప్ మ్యాచులకు రిషబ్ దూరం కానున్నాడు.
అంతకుముందు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(kapil dev) రిషబ్ పట్ల తన ఆందోళనను వ్యక్తం చేశాడు. అంతేకాదు పంత్ ప్రమాదంలో తగిలిన గాయాల నుంచి కోలుకున్న వెంటనే చెంపదెబ్బ కొట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. పంత్ లేకపోవడం వల్ల భారత జట్టు చితికి పోయిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. పిల్లలు తప్పులు చేసినప్పుడు చెంపదెబ్బ కొట్టే హక్కు తల్లిదండ్రులకు ఉన్నట్లే, పంత్ కోలుకున్న తర్వాత కపిల్ కూడా అదే చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.
అయితే రిషబ్, ఊర్వశి రౌతేలా మధ్య గతంలో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచిందని నెట్టింట చర్చ జరిగింది. ఆ క్రమంలో పలువురు అభిమానులు సైతం కలుగజేసుకుని రిషబ్ పంత్ ని వదిలేయాలని ఊర్వశితో కామెంట్లు చేయడం కూడా పెద్ద దూమరం రేగింది. అయితే ప్రస్తుతం పంత్ యాక్సిడెంట్ నేపథ్యంలో ఊర్వశి పాజిటివ్ గా స్పందించడం పట్ల పలువురు నెటిజన్లు(netizens) ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.