»Madhya Pradesh Governments Key Decision On Liquor Sales
Madhya Pradesh : మద్యం అమ్మకాలపై మధ్యప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం
మద్యం అమ్మకాల విషయంలో మధ్యప్రదేశ్( Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాష్ట్రంలో బార్లను మూసేయనున్నట్లు తెలిపింది. వైన్స్ షాపు ( Whines shop) లో మద్యం అమ్మకాలు మాత్రమే జరుగుతాయని అక్కడ కుర్చుని తాగేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు.
మద్యం అమ్మకాల విషయంలో మధ్యప్రదేశ్( Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాష్ట్రంలో బార్లను మూసేయనున్నట్లు తెలిపింది. వైన్స్ షాపు ( Whines shop) లో మద్యం అమ్మకాలు మాత్రమే జరుగుతాయని అక్కడ కుర్చుని తాగేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. విద్యా సంస్థలు, ( Educational institutions) లేడిస్ హాస్టళ్లు, ప్రార్థనా స్థలాలకు 100 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2010 నుంచి కొత్తగా ఒక్క మద్యం దుకాణాన్ని కూడా తెరవలేదని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ( Narottam Mishra) చెప్పారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు కొత్త పాలసీలో మార్పులు చేశామని వెల్లడించారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గుతుందని చెప్పారు. ఆదివారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కొత్త ఎక్సైజ్ పాలసీకి( Excise Policy) ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ వెల్లడించారు. లిక్కర్ షాపుల్లోనూ మద్యం అమ్మకాలు మాత్రమే జరుగుతాయని, అక్కడే కూర్చుని తాగేందుకు అనుమతి ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు.