కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు స్టార్ హీరో సుదీప్‌పై ఫోకస్ చేశాయి. తమ పార్టీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేశాయి. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు సుదీప్ క్యాంపెయిన్ చేయాలని కోరాయి.
సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పద్నాలుగు విపక్ష పార్టీలకు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది.
కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైని కలిసి ప్రచారం చేస్తానని సినీ హీరో సుదీప్ ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సుదీప్ స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చు అని రియాక్ట్ అయ్యింది.
Somu Veerraju : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీలో పలువురు బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. కాగా.. ఆయన ఢిల్లీ పర్యటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు. జనసేన బీజేపీ కలిసే ఉన్నాయని.. రానున్న ఎన్నికల్లోనూ కలిసే ముందుకు వెళ్తాయని ఆయన అన్నారు.
తరగతి గదిలో యువకుడు గులాబీ పువ్వు తీసి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. కోపగించుకున్న యువతి.. పువ్వును తీసిపారేసింది. ఇక్కడినుంచి వెళ్లు అని గట్టిగా అరిచింది. ఆ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది.
మనమంతా పదో తరగతి పరీక్షలు రాసే ఇక్కడకు వచ్చామని, పరీక్ష ప్రారంభమైన రెండున్నర గంటల తర్వాత బండి సంజయ్ వాట్సాప్ కు ప్రశ్నాపత్రం వచ్చిందని, కానీ అరగంటలో అది లీక్ కావడం ఏమిటని రఘునందన రావు ప్రశ్నించారు.
కన్నడ నటుడు కిచ్చ సుదీప్ కర్ణాటక బీజేపీకి మద్దతు ప్రకటించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని.. ప్రచారం మాత్రం చేస్తానని స్పష్టంచేశారు. ఈ రోజు సీఎం బొమ్మైని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.