కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వేళ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు రాసలీలల ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Harish Rao : ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. ఆయన ఈ నెల 8వ తేదీన తెలంగాణ కు రానున్నారు. కాగా.. ఆయన పర్యటన నేపథ్యంలో... మోదీ పై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మోదీ పర్యటనపై ఎద్దేవా చేశారు. ఎయిమ్స్ లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజీ వస్తే ప్రధాని మోదీ ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ కొడతారట, ఈ నాలుగేళ్లు ఏం చేశారని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
కర్ణాటక (Karnataka) మంగుళురులో దారుణం జరిగింది. ఇంట్లో చేసిన కోడి కూర (Chicken curry) రుచి చూడలేదని కొడుకుని తండ్రి చంపేశాడు. కర్ణాటకలో ఓ కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే తండ్రి షీనా(Sheena) కోడి కూర వండాడు. ఈ క్రమంలో శివరామ్ బయటకు వెళ్లి రావడంతో కోడికూర ఎలా ఉందో టేస్ట్ (Taste) చూడమని తండ్రి కొడుకును అడిగాడు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టై పైన ఆ పార్టీ లీగల్ సెల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హన్మకొండ కోర్టు విధించిన రిమాండును రద్దు చేయాలని కోరారు.
తనకు కాంగ్రెస్ హయాంలోనే పద్మ అవార్డు వస్తుందనుకున్నానని, కానీ ఇవ్వలేదని, బీజేపీ వచ్చాక మోడీ ఇవ్వరని భావించినప్పటికీ తన ఆలోచన తప్పని నిరూపించారని కర్నాటక ముస్లీం ఆర్టిస్ట్ ఖాద్రీ అన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.50 శాతం వద్ద వడ్డీ రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
పద్మ అవార్డుల ప్రదానోత్సవం దేశ రాజధాని న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయా రంగాల్లో పురస్కారాలు పొందిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి పద్మభూషణ్ చినజీయర్ స్వామి పొందారు. ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డు స్వీకరించాడు.