Bandi Sanjay Arrest: విడుదల కోసం లంచ్ మోషన్, బండిపై లోకసభనే తప్పుదారి పట్టించిన కేసిఆర్ అంటూ…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టై పైన ఆ పార్టీ లీగల్ సెల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హన్మకొండ కోర్టు విధించిన రిమాండును రద్దు చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ పైన (Bandi Sanjay Arrest) ఆ పార్టీ లీగల్ సెల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రిమాండు ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ పైన విచారణ జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని బండి సంజయ్ కి కోర్టు సూచించింది. తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది.
అంతకుముందు లంచ్ మోషన్ పిటిషన్
బండి సంజయ్ అరెస్టై పైన ఆ పార్టీ లీగల్ సెల్ (BJP legal cell) హైకోర్టులో (high court) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు (lunch motion petition) చేసింది. హన్మకొండ కోర్టు విధించిన రిమాండును రద్దు చేయాలని కోరారు. అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు. న్యాయవాదుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మధ్యాహ్నం విచారించేందుకు అంగీకరించారు. సంజయ్ పైన దాదాపు 11సెక్షన్లు పెట్టి రిమాండుకు తరలించారు. సీఆర్పీసీ 50 కింద పోలీసులు ప్రొసీజర్ పాటించకుండా అనైతికంగా ప్రవర్తించారని పిటిషన్ లో పేర్కొన్నారు. నిన్న హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది కూడా చీఫ్ జస్టిస్ బెంచ్ లో లంచ్ మోషన్ ఉంది.
లంచ్ మోషన్ పిటిషన్ లో కీలక అంశాలను పొందుపరిచారు. సంజయ్ ని తక్షణమే విడుదల చేయాలని, హన్మకొండ కోర్టు ఇచ్చిన డాకెట్ ఆర్డర్ ను సస్పెండ్ చేయాలని, అరెస్ట్ సమయంలో పోలీసులు 41ఏ నోటీస్ ఇవ్వలేదని, పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని, కరీంనగర్ నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న బొమ్మల రామారంకు తరలించారని, ఇక్కడ గతంలో నక్సలైట్లు దాడి చేశారని పేర్కొన్నారు. రాత్రంతా అక్కడే ఉంచినట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల కోసం డెబ్బై కిలో మీటర్ల దూరంలోని పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారని, ఆ తర్వాత వరంగల్ తీసుకు వెళ్లారన్నారు. కరీంనగర్ నుండి వరంగల్ కు కేవలం 60 కిలో మీటర్ల దూరం ఉందని, కానీ వేధించడం కోసం ఇలా చేశారని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారన్నారు. బీజేపీపై కుట్రలో భాగంగా ఇరికించారని, రిమాండ్ రిపోర్టులో సైతం నేరం చేసినట్లు ఎక్కడా పొందుపరచలేదన్నారు. కస్టడీలో దురుసుగా ప్రవర్తించినట్లు చెప్పారు.
లోకసభను తప్పుదారి పట్టించిన కేసీఆర్
ఇదిలా ఉండగా బండి సంజయ్ ని అరెస్ట్ చేసి, విడుదల చేసినట్లు కరీంనగర్ పోలీసులు లోకసభకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలంగాణ బీజేపీ ట్వీట్ చేసింది. ‘నిన్ననే బండి సంజయ్ ను విడుదల చేసినట్టు లోకసభ కు సమాచారం ఇచ్చిన కరీంనగర్ పోలీసులు. మరి ఎందుకు బండి సంజయ్ ను పోలీసులు కస్టడీలో నే ఉంచుకున్నారు ? ఇది ఒక్కటి చాలు కేసిఆర్ సంజయ్ మీద, బీజేపీ మీద చేస్తున్న కుట్రను తెలియచేయడానికి !’ అంటూ ట్వీట్ చేసింది.
లోకసభ నే తప్పుదారి పట్టించిన కేసిఆర్ !! నిన్ననే బండి సంజయ్ ను విడుదల చేసినట్టు లోకసభ కు సమాచారం ఇచ్చిన కరీంనగర్ పోలీసులు. మరి ఎందుకు బండి సంజయ్ ను పోలీసులు కస్టడీలో నే ఉంచుకున్నారు ? ఇది ఒక్కటి చాలు కేసిఆర్ సంజయ్ మీద, బీజేపీ మీద చేస్తున్న కుట్రను తెలియచేయడానికి !#SaveTelanganapic.twitter.com/4HKNzbFml7
— A.Venkata Ramana (Modi ka Parivar) (@AVRBJP) April 6, 2023