అనారోగ్యంతో జార్ఖండ్ (Jharkhand) విద్యా శాఖ మంత్రి జగర్నాథ్ మహతో (Jagarnath Mahto) (56) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడిన ఆయన ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకున్నారు. ఆ చికిత్స చేసుకున్న రెండేళ్లకు ఆయన మృతి చెందారు. అతడి మృతికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంతాపం ప్రకటించారు. అధికారికంగా ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీకి (Jharkhand Mukti Morcha JMM) చెందిన జగర్నాథ్ మహతో గిరిదిహ్ జిల్లా (Giridih District)లోని డుమ్రీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2020లో కరోనా బాడిన ఆయన చికిత్స పొందారు. అనంతరం ఆయన ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకున్నారు. గత నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో జగర్నాథ్ అస్వస్థతకు లోనయ్యాడు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తమిళనాడులోని చెన్నైకి ప్రత్యేక విమానంలో తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న ఆయన బుధవారం కన్నుమూశాడు.
अपूरणीय क्षति! हमारे टाइगर जगरनाथ दा नहीं रहे! आज झारखण्ड ने अपना एक महान आंदोलनकारी, जुझारू, कर्मठ और जनप्रिय नेता खो दिया। चेन्नई में इलाज के दौरान आदरणीय जगरनाथ महतो जी का निधन हो गया। परमात्मा दिवंगत आत्मा को शांति प्रदान कर शोकाकुल परिवार को दुःख की यह विकट घड़ी सहन करने की…