'Delhi Metro Girl' Speaks After Attire Video Goes Viral
Delhi Metro Girl:ఢిల్లీ మెట్రో రైలులో (metro rail) ఓ యువతి బికినీ వేసుకొని హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. వీడియోను (video) సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. ఢిల్లీ మెట్రో రైలు (delhi metro rail) కూడా స్పందిస్తూ.. ఇలా దుస్తులు (dress) ధరించొద్దు అని మార్గదర్శకాలు జారీచేసింది. దీనిపై ఆమె రియాక్ట్ అయ్యారు.
ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఏమీ పబ్లిసిటీ స్టంట్ (publicity stunt) కాదని తేల్చిచెప్పారు. ఆ ఒక్కరోజే తాను అలా రాలేదని.. గత కొన్ని నెలల నుంచి వస్తున్నానని పేర్కొన్నారు. తన గురించి ఎవరో ఏదో అనుకుంటారని దిగులు పడబోనని తేల్చిచెప్పారు. ఎవరూ ఏమి అనుకున్న ఫర్లేదు అని చెప్పారు.
‘ఎలాంటి డ్రెస్ (dress) వేసుకోవలో నా వ్యక్తిగతం. దుస్తులు ధరించేందుకు స్వేచ్చ (freedom) ఉంది. ఫేమస్ కావాలని మాత్రం ఇలా చేయడం లేదు. ఉర్పి జావేద్ నుంచి మాత్రం స్ఫూర్తి పొందలేదు. ఇటీవల ఆమె ఫోటోను స్నేహితురాలు చూపించేవరకు తనకు తెలియదు. ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకున్నా’ అని బికినీ వేసుకున్న ఆ అమ్మాయి వివరించింది.
బికినీ (bikini) వేసుకొని ఢిల్లీ మెట్రో రైలులో (delhi metro rail) ఇటీవల యువతి (girl) జర్నీ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను (video) షేర్ చేయడంతో తెగ ట్రోల్ అయ్యింది. తొలుత సదరు యువతి తమది పద్దతి గల కుటుంబం అని చెప్పింది. తర్వాత తన ఆలోచనలు మారాయని వివరించింది. తన వస్త్రధారణ గురించి ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పారని తెలిపింది. దీంతో ఇంట్లో వాళ్లకు దూరంగా ఉంటున్నానని పేర్కొంది.