Somu On Pawan Kalyan : పవన్ ఢిల్లీ పర్యటన పై సోమువీర్రాజు రియాక్షన్..!
Somu Veerraju : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీలో పలువురు బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. కాగా.. ఆయన ఢిల్లీ పర్యటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు. జనసేన బీజేపీ కలిసే ఉన్నాయని.. రానున్న ఎన్నికల్లోనూ కలిసే ముందుకు వెళ్తాయని ఆయన అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీలో పలువురు బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. కాగా.. ఆయన ఢిల్లీ పర్యటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు. జనసేన బీజేపీ కలిసే ఉన్నాయని.. రానున్న ఎన్నికల్లోనూ కలిసే ముందుకు వెళ్తాయని ఆయన అన్నారు. చంద్రబాబుతో పవనే కాదు.. నేను కూడా వివిధ సందర్భాల్లో భేటీ అయ్యానని అన్నారు.
రాజకీయాల్లో వివిధ పార్టీల నేతలు కలవడమనేది సర్వసాధారణంగా జరుగుతుంటుందని.. దాని కోసం ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు సోమువీర్రాజు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రజావ్యతిరేక విధానాలపై జనసేన, బీజేపీ కలిసి పోరాడతాయన్నారు. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ దారుణమన్నారు.
పరీక్ష లీకేజీని బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యంగా చెప్పిన ఆయన పేపర్ లీకేజీకి బండి సంజయ్ కు ఎలాంటి సంబంధం ఉంటుందని నిలదీశారు. కేసీఆర్ అవినీతి సంపదతో దేశ రాజకీయాలను నడపాలని ప్రయత్నం చేస్తున్నారని.. ఆప్, బీఆర్ఎస్ పార్టీలు తెర మరుగవ్వడం ఖాయమన్నారు .