తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) దృష్టి సారించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ ను (BJP Telangana chief Bandi Sanjay) అరెస్టు చేసిన ఘటనపై ఆయన సీరియస్ గా ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi excise policy case) కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇరుక్కు పోవడంతో ఏం చేయాలో పాలుపోని కేసీఆర్, ఎస్సెస్సీ పరీక్షా పత్రాల లీకేజీ ((SSC Exam leaks) ఘటనను బండి సంజయ్ కు ఆపాదిస్తూ అరెస్ట్ చేసి, కవిత అంశాన్ని పక్కన ద్రోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. బండి సంజయ్ వాట్సాప్ కు వచ్చిందని చెబుతున్న ప్రశ్నాపత్రం ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, పదకొండు గంటల తర్వాత టీవీ ఛానళ్లలో బ్రేకింగ్ ఇచ్చిన తర్వాత, పరీక్ష పూర్తయ్యే అర గంట ముందు.. విద్యార్థులు బయటకు వచ్చే సమయంలో సంజయ్ ఫోన్ వాట్సాప్ కు వెళ్లింది. అది కూడా ఓ జర్నలిస్ట్ పేపర్ లీక్ సమాచారాన్ని ప్రతిపక్షాలకు ఇచ్చే ఉద్దేశ్యంలో భాగంగా షేర్ చేసినట్లుగా చెబుతున్నారు. దీనిని సంజయ్ కు ఆపాదిస్తూ అరెస్ట్ చేయడం, ఆయనను ఏ1 ముద్దాయిగా పేర్కొనడంపై బీజేపీ నేతలు కక్ష సాధింపుగా చెబుతున్నారు.
బండి సంజయ్ అక్రమ అరెస్ట్ పైన అమిత్ షా ఆరా తీసినట్లు ఆ పార్టీ నేత ఎన్ రామచంద్ర రావు ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుల వారిని అక్రమంగా అరెస్టు చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖామాత్యులు అమిత్ షా గారు (Amit Shah) కొద్దిసేపటి క్రితం ఫోన్ చేసి తెలంగాణలో లో జరుగుతున్న పరిణామాలు మరియు బండి సంజయ్ (Bandi Sanjay) గారి అరెస్ట్ గురించి వాకబు చేయగా, అమిత్ షా గారికి వివరాలు తెలియజేశానని చెప్పారు. మరో బీజేపీ నేత మురళీధర రావు (Muralidhar Rao) కూడా బండి సంజయ్ అరెస్ట్ పైన తీవ్రంగా స్పందించారు. అర్ధరాత్రి పూట అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ అరెస్ట్ చట్ట విరుద్ధం, అప్రజాస్వామికం అన్నారు.