»Mla Raghunandan Rao Arrested By Bommala Ramaram Police
MLA Raghunandan Rao: 2 గంటల తర్వాత లీక్ ఏంటి.. రఘునందన్ ప్రశ్న
మనమంతా పదో తరగతి పరీక్షలు రాసే ఇక్కడకు వచ్చామని, పరీక్ష ప్రారంభమైన రెండున్నర గంటల తర్వాత బండి సంజయ్ వాట్సాప్ కు ప్రశ్నాపత్రం వచ్చిందని, కానీ అరగంటలో అది లీక్ కావడం ఏమిటని రఘునందన రావు ప్రశ్నించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Telangana chief Bandi Sanjay) ను పరామర్శించడానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావును (dubbaka mla raghunandan rao) పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆయనను బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ (Bommala Ramaram Police Station) వద్ద పోలీసులు (police) అడ్డుకున్నారు. తమ పార్టీ అధ్యక్షుడిని (BJP party chief) పరామర్శించడానికి తాను వచ్చానని, దీనికి పోలీసులు అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ముందస్తు నోటీసులు ఇచ్చారా.. ఏం తెలియకుండానే అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అంబేడ్కర్ (Ambedkar) రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, సుప్రీం కోర్టు (Supreme Court) మార్గదర్శకాలను పోలీసులు (police) పాటించడం లేదన్నారు. తమ అధ్యక్షుడు ఎలా ఉన్నాడో చూడాలన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, రఘునందన రావుకు (Raghunandan Rao) మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అన్నారు. ముద్దాయిని ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పవలసి ఉందని, దీనిని ప్రశ్నించేందుకు వస్తే పోలీసులు తమ నేతల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం సరికాదన్నారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేసే అధికారం చట్టం ప్రకారం ఉందని, కానీ సంజయ్ ని ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పాలన్నారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణలో బీహార్ గూండా రాజకీయాన్నీ తీసుకు రావొద్దని హితవు పలికారు.
బీహార్ రాజ్యాంగాన్ని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) అమలు చేసే అన్యాయ చట్టాన్ని అమలు చేయడం కాదని, అంబేడ్కర్ రాసిన చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ రోజు జగ్జీవన్ రామ్ జయంతి రోజున ప్రజాస్వమ్యాన్ని కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక్కడ బీహార్ గూండా రాజ్యం వద్దని, చట్టం ప్రకారం వెళ్తే సహకరిస్తామన్నారు. అంజనీ కుమార్ కు ప్రత్యేక సీఆర్పీసీ, ఐపీసీ ఉంటుందనుకోవద్దని, అలా చేస్తామంటే ఆయనను పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. బండి సంజయ్ వాట్సాప్ కు ప్రశ్నాపత్రం వచ్చిందని, కానీ ఏ సమయంలో వచ్చింది, ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అభిప్రాయపడ్డారు.
మనమంతా పదో తరగతి పరీక్షలు (SSC Exam leaks)) రాసే ఇక్కడకు వచ్చామని, పరీక్ష ప్రారంభమైన రెండున్నర గంటల తర్వాత బండి సంజయ్ వాట్సాప్ కు ప్రశ్నాపత్రం వచ్చిందనేదే నిజమైతే.. కానీ అరగంటలో అది లీక్ కావడం, ఆ తర్వాత జర్నలిస్టులు స్క్రోలింగ్ లలో ఇవ్వడం, ఆ తర్వాత ఓ జర్నలిస్ట్ మీడియా ప్రతిపక్ష నేతలకు పేపర్ లీక్ అయిందని చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా బండి సంజయ్ కు రెండున్నర గంటల తర్వాత ప్రశ్నా పత్రాన్ని పంపించారన్నారు. తొమ్మిదిన్నరకు పరీక్ష హాలులోకి వెళ్లిన విద్యార్థి పదకొండున్నర వరకు దాదాపు బయటకు వస్తాడని, ఆ సమయంలో సంజయ్ కు ప్రశ్నాపత్రం వచ్చిందని గుర్తు చేశారు. రెండు గంటల తర్వాత.. అంటే పరీక్ష పూర్తయ్యే సమయానికి పేపర్ సంజయ్ వద్దకు వస్తే లీక్ అనే విషయం ఎక్కడిదని ప్రశ్నించారు. అన్ని టీవీ ఛానళ్లలో కూడా బ్రేకింగ్ కూడా వచ్చిందన్నారు. దీనికి బండిని, జర్నలిస్ట్ ను ప్రశాంత్ ను అదుపులోకి తీసుకోవడం విడ్డూరమన్నారు. ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని సుప్రీం గైడ్ లైన్స్ ఉన్నాయన్నారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏమిటన్నారు.
IPS అధికారుల సంఘం
డీజీపీ అంజనీ కుమార్ బీహార్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్న రఘునందన రావు వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీ పైన అలాంటి పదాలు దారుణం అన్నారు. రఘునందన్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు.