రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఒకరోజు దీక్ష చేపట్టారు. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లట్ చర్యలు తీసుకోవడం లేదని.. అందుకు నిరసనగా దీక్షకు దిగారు.
Corona Cases : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఐదు వేలకు పైనే కేసులు వెలుగు చూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..
అబ్బాయి తన కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో విసిగిపోయిన కుటుంబం ముందుగా కొడుకు, కోడలును ఇంటికి పిలిపించింది. అప్పుడు కోడలిని భజనకు తీసుకెళ్లి బలితీసుకున్నారు.
సోషల్ మీడియాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర యాక్టివ్‌గా ఉంటారు. మండే మోటివేషన్స్ అని పెంగ్విన్ల మార్చ్‌కు సంబంధించి వీడియో పోస్ట్ చేశారు. అందులో తేడా గమనించారా అని అడిగారు.
అలీగఢ్‌లో బీజేపీ యువనేత జన్మదిన వేడుకలను నడిరోడ్డుపై నిర్వహించారు. కత్తితో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. దీంతో పాటు పార్టీలో గాలిలో కాల్పులు కూడా జరిగాయి. విచారణ అనంతరం చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు నిఘా పెంచారు. నగరంలో జరుగుతున్న ప్రతి అనుమానాస్పద కార్యకలాపాలపైనా అధికారులు నిఘా పెడుతున్నారు. దీనికి సంబంధించి బెంగళూరులో డ్రగ్స్(drugs) స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేసి ఐదుగురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుల నుంచి రూ.8.2 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించడం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి ఫిర్యాదులు చేయడంతో వారు కొంత వెనక్కి తగ్గారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్ తమిళిసై తన వద్ద ఉన్న పెండింగ్ బిల్లులు అకస్మాత్తుగా ఆమోదం తెలిపారు.
హమీర్‌పూర్ జిల్లాలో ఆస్తి(property) కోసం కన్న తండ్రినే చంపేశాడో కొడుకు. భూ వివాదం కారణంగా కలుయాగి కుమారుడు తన తండ్రిని పదునైన ఆయుధంతో హత్య చేశాడు. పట్టపగలు ఈ హత్య ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Imran Khan : ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత కొంత కాలంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రశంసలు కురిపించడం విశేషం.
తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన మీద చైనా అభ్యంతరం చెప్పడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. మన భూభాగాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, ఎవరూ లాక్కోలేరని డ్రాగన్ కంట్రీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు
జంషెడ్ పూర్ లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య హింసాత్మక సంఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించి 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కరోనాతో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పల్లా శ్రీనివాస రావు అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.