»Son Killed Elderly Father Dispute Property Hamirpur Uttar Pradesh
Crime News : వీడు కొడుకా.. ఆస్తి కోసం అడ్డువచ్చిన వాళ్లందినీ గొడ్డలితో నరికి..
హమీర్పూర్ జిల్లాలో ఆస్తి(property) కోసం కన్న తండ్రినే చంపేశాడో కొడుకు. భూ వివాదం కారణంగా కలుయాగి కుమారుడు తన తండ్రిని పదునైన ఆయుధంతో హత్య చేశాడు. పట్టపగలు ఈ హత్య ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Crime News : మానవ బంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి. రూపాయి కోసం మనిషి ప్రస్తుతం ఎంత దారుణానికైనా పాల్పడుతున్నాడు. అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు అన్న వరుసలు లేకుండా డబ్బుకోసం దారుణాలకు ఒడికట్టుతున్నారు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్(Uttarpradesh) లో చోటు చేసుకుంది. హమీర్పూర్ జిల్లాలో ఆస్తి(property) కోసం కన్న తండ్రినే చంపేశాడో కొడుకు. భూ వివాదం కారణంగా కలుయాగి కుమారుడు తన తండ్రిని పదునైన ఆయుధంతో హత్య చేశాడు. పట్టపగలు ఈ హత్య ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ దారుణంలో బాధిత వ్యక్తి కొడుకుతో పాటు మనవడు(Grand son) కూడా ఉన్నట్లు సమాచారం. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
రామ్ గులాం ప్రజాపతి(70)ని అతని కొడుకు, మనవడు పదునైన ఆయుధంతో దాడి చేసి చంపారు. వృద్ధుడిని రక్షించడానికి అతని కోడలు వచ్చినప్పుడు ఆమెను కూడా కొట్టినట్లు చెబుతున్నారు. కొడుకు, మనవడు గొడ్డలి(Axe)తో దాడి చేసి తండ్రిని హతమార్చారు. అనంతరం వారు పారిపోయారు. ఈ హత్య సంఘటన సుమెర్పూర్ పోలీస్ స్టేషన్(Police station) పరిధిలోని సిమ్నౌడి గ్రామంలో చోటుచేసుకుంది. నిందితులైన తండ్రీకొడుకులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎస్పీ(SP) ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం(Forensic) కూడా ఘటనాస్థలికి చేరుకుని ఘటనపై ఆధారాలు సేకరించింది.